Wednesday, April 8, 2026

హెడ్లైన్ : తిరుమల, అరుణాచలం దర్శనం చేసిన రాఘవేంద్ర రెడ్డి

నేటి సాక్షి న్యూస్ ఏప్రిల్ 7మంత్రాలయం: మంత్రాలయం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్‌చార్జి ఎన్. రాఘవేంద్ర రెడ్డి కుటుంబ సమేతంగా ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలైన తిరుమలలో శ్రీ వేంకటేశ్వర స్వామివారిని, తమిళనాడులోని అరుణాచలం శ్రీ అరుణాచలేశ్వర స్వామివారిని భక్తిశ్రద్ధలతో దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయాల్లో ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించి స్వామివారి ఆశీర్వాదాలు పొందారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తిరుమల మరియు అరుణాచలం వంటి పవిత్రక్షేత్రాల దర్శనం జీవితంలో ఎంతో ఆధ్యాత్మిక ఆనందాన్ని కలిగిస్తుందని పేర్కొన్నారు. నియోజకవర్గ ప్రజల సుఖశాంతులు, ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం కోసం ప్రత్యేకంగా ప్రార్థించినట్లు తెలిపారు. ప్రాంత అభివృద్ధి వేగవంతం కావాలని, ప్రజల సంక్షేమం మరింత మెరుగుపడాలని దేవుని దయ కోరుకున్నట్లు చెప్పారు.అలాగే ప్రజలందరూ ఐక్యంగా ముందుకు సాగుతూ సమాజ అభివృద్ధికి తోడ్పడాలని సూచించారు. దేవుడి ఆశీస్సులతో ప్రతి కుటుంబంలో ఆనందం, శాంతి నెలకొనాలని ఆకాంక్షించారు. ఈ దర్శనం తనకు మానసిక ప్రశాంతతను ఇచ్చిందని, ప్రజల సేవలో మరింత కృషి చేయాలనే సంకల్పాన్ని బలపరిచిందని ఆయన తెలిపారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News