నేటి సాక్షి న్యూస్ ఏప్రిల్ 04 కర్ణాటక రాష్ట్రంలోని సింధనూరు లో సైనిక్ స్కూల్ ప్రారంభోత్సవం మరియు ఎన్టీఆర్ కాంస్య విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమాలకు హాజరైన గౌరవ విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్, కేంద్ర ఉక్కు మరియు భారీ పరిశ్రమల శాఖ మంత్రి హెచ్.డి. కుమారస్వామి, కేంద్ర రక్షణశాఖ సహాయ మంత్రి సంజయ్ సేథ్లను మంత్రాలయం తెలుగుదేశం పార్టీ ఇన్చార్జ్ ఎన్. రాఘవేంద్ర రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా నాయకులతో భేటీ అయిన రాఘవేంద్ర రెడ్డి, కార్యక్రమం విజయవంతంగా నిర్వహించడంపై అభినందనలు తెలియజేశారు. కార్యక్రమంలో పలువురు నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.





