Saturday, March 14, 2026

హెడ్ వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ తెలంగాణ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ మెంబర్ గా పద్మావతి నియామకం.

నేటి సాక్షి ఉప్పల్ అక్టోబర్28 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో కార్యకలాపాలు కొనసాగిస్తున్న హెడ్ వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ కు తెలంగాణ రాష్ట్రానికి చెందిన జె.పద్మావతి ని తెలంగాణా రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ నెంబర్ గా నియమించినట్లు హెడ్ సంస్థ చైర్మన్ మాధవ్ మీడియాకు తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ మెంబర్ గా నియమితులైన జె.పద్మావతి మాట్లాడుతూ నా మీద నమ్మకం ఉంచి నన్ను ఎగ్జిక్యూటివ్ నెంబర్ గా నియమించినందుకు చైర్మన్ మాధవ్, నా నియామకానికి కృషిచేసిన జాతీయ ప్రధాన కార్యదర్శి సతీష్ దేవరకొండ లకు ధన్యవాదాలు తెలిపారు. నా శక్తి మేరకు సంస్థ ఎదుగుదలకు కృషి చేస్తానని బాధితులకు అండదండగా ఉంటానని, బాధితులకు న్యాయం లభించే లాగా పోరాటం చేస్తానని స్పష్టం చేశారు. హెడ్ వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ తరఫున మానవ హక్కుల పరిరక్షణకు కట్టుబడి ఉంటామని తెలిపారు. పదవి బాధ్యతలు చేపట్టిన పద్మావతి కి సంస్థ సభ్యులు, పుర ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేసి ఘనంగా సత్కరించారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News