ఎన్‌పిఆర్‌డి ఇండియా జిల్లా అధ్యక్షులు అడ్డ రాజు.
నేటి సాక్షి, నల్లబెల్లి,జూన్ 27: వరంగల్ జిల్లా నల్లబెల్లి మండల కేంద్రంలోని గ్రామ పంచాయితీ ఆవరణలో అణగారిన వర్గాల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు పరికి కోర్నెలు. దివ్యాంగుల హక్కుల జాతీయ వేదిక ఎన్ పి ఆర్ డి ఇండియా. వరంగల్ జిల్లా అధ్యక్షులు అడ్డరాజు. ఆధ్వర్యంలో శుక్రవారం హెలెన్ కెల్లర్ 145వ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు ఆర్పించారు. అనంతరం అడ్డ రాజు. మాట్లాడుతూ హెలెన్ కెల్లర్ చిన్న వయసులోనే చూపు, వినికిడి కోల్పోయినప్పటికీ ఆదైర్య పడకుండా 35 దేశాలు పర్యటించి దివ్యాంగుల హక్కులకోసం చైతన్య కార్యక్రమాలు నిర్వహించారన్నారు, అనేక అంశాలపై 14 పుస్తకాలు,వేలాది వ్యాసాలు రచించిన హెలెన్ కెల్లర్ దివ్యాంగుల పక్షపాతిగాగానే కాకుండా జీవితాంతం కార్మిక హక్కులు, మహిళా హక్కులతో పాటు ప్రపంచ శాంతి కోసం కృషి చేశారన్నారు. ఆమె జీవితాన్ని ప్రతి దివ్యాంగుడు ప్రేరణగా తీసుకోవాలన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సైతం హెలెన్‌కెల్లర్ జయంతిని అధికారింగా నిర్వహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎన్.పి.ఆర్.డి ఇండియా నాయకులు వైనాల శ్రీనివాస్. బోట్ల దయాకర్. నాగరాజు తదితరులు పాల్గొన్నారు.





