నేటి సాక్షి,నారాయణపేట, నవంబర్ 22, నారాయణపేట జిల్లాలోని మరికల్ మండల పరిధిలోని పీ తీలేరు గ్రామానికి చెందిన తల్లి ఆశమ్మ, కొడుకు రమేష్ లు కలిసి తమను వేధింపుల గురి చేస్తున్నారని శనివారం ఫిర్యాదు చేసినట్లు ఒక ప్రకటనలో తెలిపారు…. వివరాలు ఇలా ఉన్నాయి… దేవరకద్ర కు చెందిన కొందరు మా ఇండ్ల పైకి వచ్చి వేధింపుల గురి చేస్తున్నారని.. రాత్రి వేళలో మా ఇండ్ల పైకి వచ్చి కిడ్నాప్ చేసి చంపుతామని భయాందోళన గురి చేస్తున్నా వారిపై కఠిన చర్యలు తీసుకొని మాకు న్యాయం చేయాలని హైదరాబాద్ ఎస్సీ కమిషనర్ కు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేసినట్లు వారు ప్రకటనలో పేర్కొన్నారు.





