(నేటి సాక్షి) ఫిబ్రవరి:4 ప్రతినిధి. గండిపేట మండలం హైదర్ షాకోట్ గ్రామ పరిధిలోని సర్వే నంబర్ 18/4లో మొత్తం 39 ఎకరాలు 24 గుంటల భూమి ఉన్నట్లు యజమాని బెల్లి రవికుమార్ యాదవ్ తెలిపారు. ఇందులో 31 ఎకరాలు 18 గుంటల భూమిని దేశ సేవ నిమిత్తం గతంలో మిలటరీ అధికారుల అవసరాల కోసం అప్పగించినట్లు ఆయన పేర్కొన్నారు.1976 సంవత్సరంలో 21 ఎకరాలు 39 గుంటల భూమికి నష్టం పరిహారం కూడా చెల్లించారని, అప్పట్లో ఆదాయపు పన్ను సైతం చెల్లించినట్లు తెలిపారు.మిగులు భూమి ఇప్పటికీ మిలటరీ అధికారుల అధీనంలోనే ఉండగా, దానిపై కూడా తాము చట్టపరంగా పోరాటం చేస్తున్నామని చెప్పారు.అదే సర్వే నంబర్‌కు సంబంధించిన ఒక వైపున 1 ఎకరం 36 గుంటల భూమి తమదేనని, దానిని చుట్టూ ప్రహరీ గోడను నిర్మించి ఉన్నట్లు రవికుమార్ యాదవ్ తెలిపారు. అయితే ఈ భూమి మాదని సర్వే నంబర్ 15తో తప్పుడు దస్త్రాలను సృష్టించి, జంగారెడ్డి పావని రెడ్డి అనే వ్యక్తులు దౌర్జన్యంగా జేసీబీలతో ప్రహరీ గోడను కూలగొట్టి భూమిలోకి అక్రమంగా ప్రవేశించి కబ్జా చేసేందుకు ప్రయత్నించారని ఆయన ఆరోపించారు.ఈ ఘటనపై రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. తమ వద్ద కోర్టు ఆర్డర్ మిలటరీ అధికారుల నుండి ఎన్వోసీ రెవెన్యూ అధికారుల నుండి ఎన్ఓసి తమ భూమిగా పేర్కొంటూ అన్ని పత్రాలు ఉన్నాయన్నారు. తప్పుడు పత్రాలతో భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నించిన వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకొని తమకు న్యాయం చేయాలని పోలీసులను కోరినట్లు బెల్లి రవికుమార్ యాదవ్ మీడియా సమావేశంలో వెల్లడించారు.





