నేటి సాక్షి,నారాయణపేట డిసెంబర్ 5, హోంగార్డ్స్ రైజింగ్ డే (ఆవిర్భావ దినోత్సవం) సందర్బంగా నారాయణపేట జిల్లా పోలీస్ పరేడ్ మైదానంలో హోంగార్డుల శారీరక దృఢత్వం, టీమ్ స్పిరిట్ పెంపు, వారి సేవలను గుర్తించే ఉద్దేశ్యంతో క్రీడా పోటీలను ఘనంగా నిర్వహించారు.జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ ఆదేశాల మేరకు, ఈ కార్యక్రమాన్ని అదనపు ఎస్పీ ఎం.డి. రియాజ్ హుల్ హక్ పర్యవేక్షించారు. జిల్లా పరిధిలో విధులు నిర్వహిస్తున్న హోంగార్డులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఉత్సాహంగా పోటీల్లో తమ ప్రతిభను కనబరిచారు.ఈ సందర్భంగా హోంగార్డుల మధ్య వాలీబాల్, కబడ్డీ, 100 మీటర్ల రన్నింగ్, 200 మీటర్ల రన్నింగ్ వంటి పలు క్రీడా విభాగాల్లో పోటీలు నిర్వహించబడినాయి. ప్రతి విభాగంలో పాల్గొన్న హోంగార్డులు తమ శారీరక సామర్థ్యాన్ని, క్రమశిక్షణను, జట్టు స్ఫూర్తిని ప్రతిబింబించేలా ప్రదర్శన ఇచ్చారు.క్రీడలు హోంగార్డుల ఆరోగ్య పరిరక్షణ, స్ట్రెస్ తగ్గింపు, మరియు విధి నిర్వహణ సామర్థ్యాల పెరుగుదలకు ఎంతగానో దోహదం చేస్తాయని ఈ అదనపు ఎస్పీ ఎం.డి. రియాజ్ హుల్ హక్ పేర్కొన్నారు. పోలీస్ శాఖలో ప్రతి హోంగార్డ్ పాత్ర ఎంతో కీలకమని, రైజింగ్ డే సందర్భంగా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం వారి సేవలను గుర్తించడమేనని అన్నారు.ప్రతి విభాగంలో గెలుపొందిన విజేతలకు రైజింగ్ డే రోజు ఎస్పీ గారి చే ప్రత్యేక బహుమతులు అందజేయబడతాయి.కార్యక్రమంలో ఆర్ఎస్ఐ లు శివశంకర్, మద్దయ్య, హోంగార్డ్స్ పాల్గొన్నారు.





