Tuesday, March 24, 2026

*హోమ్ గార్డుల సేవలు ప్రజా భద్రతకు పునాది** జగిత్యాల జిల్లా కేంద్రంలో హోమ్ గార్డ్ రైజింగ్ డే వేడుకలు* విపత్తుల నుంచి శాంతిభద్రతల వరకు అంకితభావంతో సేవలు* హోమ్ గార్డుల నిబద్ధత ప్రశంసనీయం: ఎస్పీ అశోక్ కుమార్—-*

నేటి సాక్షి – జగిత్యాల*( రాధారపు నర్సయ్య )జగిత్యాల జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయం ప్రాంగణంలో గురువారం హోమ్ గార్డ్ రైజింగ్ డేను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర డీజీపీ ఆదేశాల మేరకు మొక్కలు నాటిన ఎస్పీ అశోక్ కుమార్ మాట్లాడారు. ప్రజాభద్రత, ట్రాఫిక్ నియంత్రణ, విపత్తు ప్రతిస్పందన, కమ్యూనిటీ పోలీసింగ్, శాంతిభద్రతల నిర్వహణ వంటి కీలక రంగాల్లో హోమ్ గార్డులు చూపుతున్న నిబద్ధత అపూర్వమని ఆయన పేర్కొన్నారు. అత్యవసర పరిస్థితుల్లో ముందు వరుసలో నిలిచి పనిచేయడం, ప్రతి డ్యూటీని బాధ్యతగా నిర్వహించడం హోమ్ గార్డుల గుర్తింపని ఆయన అభిప్రాయపడ్డారు.*జిల్లాకు గర్వకారణమైన సేవాస్ఫూర్తి*హోమ్ గార్డ్ సిబ్బంది క్రమశిక్షణ, సమయపాలన, సేవాస్ఫూర్తి పోలీస్ శాఖను మరింత బలోపేతం చేస్తున్నాయని ఎస్పీ అన్నారు. విపత్తుల సమయంలో సహాయక చర్యలు, ట్రాఫిక్ మేనేజ్‌మెంట్, క్రైమ్ ప్రివెన్షన్ వంటి రంగాల్లో హోమ్ గార్డులు చేస్తున్న సేవలు ప్రజా భద్రతకు పునాది వంటివని పేర్కొన్నారు. సమాజ భద్రతకు అవిభాజ్య భాగాలుగా ఉన్న హోమ్ గార్డులను ప్రభుత్వం మరింత ప్రోత్సహిస్తోందని ఆయన తెలిపారు.ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ శేషాద్రి రెడ్డి, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు కిరణ్ కుమార్, సైదులు, వేణు, రిజర్వ్ ఎస్‌.ఐలు, హోమ్ గార్డ్ సిబ్బంది పాల్గొన్నారు.___

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News