నేటిసాక్షి, మిర్యాలగూడ : పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంగళవారం గిరిజన సోదరులతో, నియోజకవర్గ ప్రజలతో, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసిశాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ కేతావత్ శంకర్ నాయక్, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు స్కైలాబ్ నాయక్, డిఎస్పీ రాజశేఖర్ రాజు లతో కలసి ఘనంగా హోళీ వేడుకలను జరుపుకున్నారు. ఈ సందర్భంగా వారు హోళీ సంబురాల్లో భాగంగా రంగులు పూసుకొని, నియోజకవర్గ ప్రజలందరికీ హోళీ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ హోళీ వేడుకల్లో కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులు, తదితరులు పాల్గొన్నారు.





