Friday, February 13, 2026

హ్యాట్రిక్ కొట్టిన 7వ వార్డు కౌన్సిలర్

నేటి సాక్షి రాయికల్ (ఇమ్మడి విజయ్ కుమార్ ) : శుక్రవారం వెలువడిన మున్సిపల్ ఎన్నికల ఫలితాలలో ఏడవ వార్డు కౌన్సిలర్ ఎలిగేటి లతిక అనిల్ భారీ మెజారిటీతో విజయం సాధించారు. దీంతో హ్యాట్రిక్ విజయం సొంతమైంది. గ్రామపంచాయతీ గా ఉన్నప్పుడు ఎలిగేటి అనిల్ మొదటిసారిగా వార్డు మెంబర్ గా గెలుపొందాడు. అలాగే మున్సిపల్ ఏర్పడిన తర్వాత ఎలిగేటి లతిక అనిల్ బి ఆర్ ఎస్ తరుపున వరుసగా రెండోసారి హ్యాట్రిక్ విజయం సాధించారు. మాజీ మున్సిపల్ చైర్మన్ మోర హనుమాన్లు కాంగ్రెస్ పార్టీ , బిజెపి పార్టీ నుండి సామల్ల రాజేశం, స్వతంత్ర అభ్యర్థి కోన రాజు లు గా మున్సిపల్ ఎన్నికల్లో బరిలో ఉన్నారు. ఇందులో కాంగ్రెస్ తరపున పోటీ చేసిన అభ్యర్థి మోర హనుమాన్లు పై 452 ఓట్ల భారీ మెజారిటీతో గెలుపొందారు. తనను నమ్మి భారీ మెజారిటీతో గెలుపొందించిన ఏడో వార్డు ఓటర్లకు మరియు గెలుపుకు సహకరించిన వారందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు. మరోసారి కౌన్సిలర్ గా గెలుపొందినందుకు వార్డులో ఉన్న ప్రతి సమస్యను తీరుస్తానని మన వార్డును అభివృద్ధితో రాయికల్ పట్టణంలోనే ముందంజలో నిలబెడతానని అన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News