Friday, March 20, 2026

◼️ || కల్తీ మద్యం కేసులో టీడీపీ నేత జయ చంద్రా రెడ్డి పీఏ అరెస్ట్..||◼️రెండు నెలలుగా పోలీసులకు చిక్కకుండా ముప్ప తెప్పలు పెట్టిన అక్రమ నకిలీ మద్యం తయారీ ముద్దాయి అరెస్ట్..!

నేటి సాక్షి పత్రిక పాత్రికేయులు శర్మ, అన్నమయ్య జిల్లా, డిసెంబర్ 10 ~అన్నమయ్య జిల్లా :-: ములకలచెరువు లో ఇటీవల నకిలీ మద్యం తయారీ డంపు బయటపడటం విషయం తెలిసిందే. ఈ ఘటన ఉమ్మడి రాష్ట్రాల్లో (ఆంధ్ర, తెలంగాణ) లలో పెను సంచలనం సృష్టించింది. ఈ నకిలీ మద్యం తయారీ డంపు బయటపడగానే సూత్ర, పాత్ర దారులు తంబళ్లపల్లి నియోజకవర్గ టీడీపీ ఇంచార్జు దాసరపల్లి జయ చంద్రారెడ్డి, ఆయన బావమర్ది మంత్రి గిరిధర్ రెడ్డి దేశాన్ని విడిచి విదేశాలకు పారిపోయారు. ఈ నకిలీ మద్యం తయారీ కేసు లో ప్రధానమైన నిందితులుగా ఈ ఇద్దరినీ ఎక్సైజ్ శాఖ పరిగణించింది. కానీ వీరిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. వీళ్లేమో విదేశాల్లో మస్త్ ఎంజాయ్ చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం వీరిని పట్టుకునే ప్రయత్నం చేయకపోవడంతో ప్రజలు మండిపడుతున్నారు. వీళ్లను ఎందుకు అరెస్ట్ చేయడం లేదో. ఒకవేళ వీరిని అరెస్ట్ ఎక్కడ మరింత మంది టీడీపీ నేతల పేర్లు బయటొచ్చి కూటమి ప్రభుత్వం పరువు పోతుందేమోనని అందుకే వీరిని అరెస్ట్ చేయటం లేదనే వాదన గట్టిగా వినిపిస్తోంది. ఒక వేళ వీళ్ళు దొరికితే టీడీపీ వాళ్ల గుట్టు ఎక్కడ రట్టవుతుందోనని భావిస్తునందుకే విరిపై చర్యలు తీసుకోవడం లేదనే వాదన వినిపిస్తోంది. వీళ్లే కాకుండా వీరి వద్ద పనిచేసే వారిని కూడా చిక్కకుండా మూడు నెలలుగా సంబంధిత పోలీస్ శాఖ అధికారులకు మరియు సివిల్ శాఖ అధికారులకు ముప్పతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాపించారు. కానీ ఎట్టకేలకు పాపం పండి మంగళవారం దాసరపల్లి జయచంద్రారెడ్డి పి ఏ గా వ్యవహరిస్తున్న రాజేష్ వ్యక్తిగత లాయర్ తో హైకోర్టు లో ముందస్తు బెయిల్ కొరకు విజయవాడకు వెళ్తుండగా మార్గమధ్యంలో పోలీసులు వాహనాలను ఆపి విస్తృత తనిఖీలు చేపడుతున్నారు. పోలీసులను చూసి దాక్కునే ప్రయత్నం చేశాడు. అనుమానించిన పోలీసులు అతని పట్టుకుని పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లి విచారించారు. దీంతో గుట్టురట్టయింది. ఈ సందర్భంగా పోలీసులు మీడియాకు వెల్లడిస్తూ ములకలచెరువు కల్తీ మద్యం తయారీ కేసులో తంబళ్లపల్లి టీడీపీ మాజీ ఇంచార్జు, పార్టీ బహిష్కృత నేత దాసరపల్లి జయచంద్రారెడ్డి పి.ఎ A.5 ముద్దాయిగా ఉన్న రాజేష్ అనే యువకుడిని పోలీసులు నిర్వహిస్తున్న సోదాల్లో భాగంగా పట్టుకున్నామని ఆ యువకుడిని పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లి విచారించడంతో బయటపెట్టాడని దీంతో చెరువు పోలీసులకు సమాచారమిచ్చి వారి సంరక్షణలో తంబళ్లపల్లి జూనియర్ సివిల్ జడ్జి కోర్టు జడ్జి ఎదుట హాజరు పరచడం జరిగింది. న్యాయాధికారి▪️రాజేష్ కు 14 రోజుల పాటు రిమాండ్ విధించారు. అనంతరం నిందితుడిని ఎక్సైజ్ శాఖ అధికారులు మదనపల్లి సబ్ జైలుకు తరలించారు. ఈ యువకుడిని విచారిస్తే తంబళ్లపల్లి టీడీపీ బహిష్కృత నేత దాసరపల్లి జయచంద్రా రెడ్డి, ప్రధాన నిందితుడు A1 ముద్దాయి జనార్దన్ రావు మైత్రి బంధం జరిపిన లావాదేవీలు బయటొచ్చే అవకాశముంది..~~~~~~~~~~~~~~~~~

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News