నేటి సాక్షి మార్చి 11 (మంచిర్యాల్) శ్రీధర్ దమ్మ సావిత్రిబాయి పూలే గారి వర్ధంతి సందర్భంగా మంచిర్యాల్ కార్పొరేషన్ 4 వ డివిజన్ బహుజన్ సమాజ్ పార్టీ కంటెస్టెంట్ అయినా శెట్టి ప్రవళిక గారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బహుజన సమాజ్ పార్టీ మంచిర్యాల జిల్లా ఇన్చార్జిలు శ్రీ నాగుల కిరణ్ బాబు గారు మరియు శ్రీ దాగం శ్రీనివాస్ గారు మరియు బామ్ సేఫ్ నాయకులు శెట్టి శంకరయ్య గారు, పెరిక మహేందర్ గారు, సుందిళ్ల నరేష్ గార్లు పాల్గొని సావిత్రిబాయి పూలే గారు మహిళలకు చేసిన సేవలను గురించి గుర్తు చేసి అలాగే బహుజనులకు విద్య ను ప్రసాదించిన సావిత్రిబాయి పూలే గారికి ఘనంగా నివాళులర్పించి విజయవంతం చేయడం జరిగింది అలాగే తెలంగాణ రాష్ట్రంలోని పాఠశాలలో సావిత్రిబాయి పూలే గారి విగ్రహాన్ని ప్రతిష్టింప చేయాలని బహుజన సమాజ్ పార్టీ తరఫున డిమాండ్ చేయడం జరిగింది.





