Wednesday, March 11, 2026

🔥విలేకర్లపై! కాంగ్రెస్ నాయకుల దాడి 🔥

నేటి సాక్షి మార్చి 11 (మంచిర్యాల్) శ్రీధర్ దమ్మ విలేకరిపై కాంగ్రెస్ నాయకుల దాడిని ఖండించిన బీఆర్‌ఎస్ నాయకులుకన్నెపల్లి మండల కేంద్రంలో ఈరోజు బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు ప్రెస్‌మీట్ నిర్వహించి విలేకరిపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, 05-03-2026న ఎన్కే-24 రిపోర్టర్ చెండే చంద్రశేఖర్ కన్నెపల్లి మండల కేంద్రంలోని కేజీబీవీ పాఠశాలలో నిర్మిస్తున్న ప్రహరీ గోడ పనుల్లో నాణ్యత లోపాలు ఉన్నాయని, అక్రమాలు జరుగుతున్నాయని వార్త ప్రచురించారని తెలిపారు. ఆ వార్త రాసిన కారణంగా కాంగ్రెస్ నాయకులు ఆయనపై దాడి చేశారని ఆరోపించారు.దాడి చేసిన కాంగ్రెస్ నాయకులపై వెంటనే కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అధికార పార్టీ నాయకుల ఒత్తిడి వల్లనే పోలీసులు విలేకరి పై తప్పుడు కేసు నమోదు చేశారని వారు ఆరోపించారు. దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాల్సిన బదులు బాధితుడిపై కేసు పెట్టడం అన్యాయమని ఆగ్రహం వ్యక్తం చేశారు.విలేకరిపై నమోదైన తప్పుడు కేసును వెంటనే రద్దు చేసి ఆయనకు రక్షణ కల్పించాలని కోరారు. లేనిపక్షంలో పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నాయకులు ఆకుతోట రాజన్న (మాజీ PACS చైర్మన్), గువ్వల రవి (సర్పంచ్), నియోజకవర్గ యువజన అధ్యక్షుడు జిల్లెల్ల మహేష్ గౌడ్, బండ గణేష్, ఎన్న రవి, చి. రాములు, తలండి అశోక్, బెడ్డల శ్రీనివాస్, వడుగురి బాపు, బెలాజీ, ఎ. రమేష్ తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News