Sunday, January 18, 2026

🔥 30 నెలల అద్దె బకాయి.. ఎంపీడీవో కార్యాలయానికి తాళం..!🔥 ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిరసనగా కార్యాలయం లాక్ చేసిన యజమాని..!🔥 ప్రజలు బయటే వేచిచూపులు.. “న్యాయం చేయండి” అంటూ యజమాని వేడుకోలు..!

నేటి సాక్షి మహబూబాబాద్ (భూక్యా రవి నాయక్) జనవరి13 మహబూబాబా ద్ జిల్లా పెద్ద వంగర మండలంలో సంచలన ఘటన చోటుచేసుకుంది.గత 30 నెలలుగా అద్దె చెల్లించకపోవడంతో ఎంపీడీవో కార్యాలయానికి భవన యజమాని రాంపక నారాయణ తాళం వేసి తీవ్ర నిరసన వ్యక్తం చేశారు.ఎంపీడీవో కార్యాలయం నడుస్తున్న భవనానికి సంబంధించి తనకు👉 అద్దె బకాయి రూ. 2 లక్షల 10 వేల రూపాయలు,👉 కరెంట్ బిల్లులు సుమారు రూ. 1 లక్ష 70 వేల పైచిలుకరావాల్సి ఉందని యజమాని తెలిపారు.ఎన్నిసార్లు అధికారులకు విజ్ఞప్తి చేసినా పట్టించుకోకపోవడంతో తప్పని పరిస్థితుల్లో కార్యాలయానికి తాళం వేయాల్సి వచ్చిందని రాంపక నారాయణ ఆవేదన వ్యక్తం చేశారు.ఈ ఘటనతో మధ్యాహ్నం వరకు ఎంపీడీవో కార్యాలయానికి వచ్చిన ప్రజలు బయటే వేచిచూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. పనుల కోసం వచ్చిన రైతులు, లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.“ప్రభుత్వ కార్యాలయానికే న్యాయం జరగకపోతే మామూలు ప్రజల పరిస్థితి ఏంటి..?” అంటూ యజమాని ప్రశ్నించారు.తనకు రావాల్సిన అద్దె వెంటనే చెల్లించాలి అంటూ అధికారులను వేడుకుంటూ కార్యాలయం ముందు నిరీక్షించారు.ఈ ఘటనతో ప్రభుత్వ కార్యాలయాల నిర్వహణ, అద్దె భవనాల చెల్లింపులపై తీవ్ర చర్చకు తెరలేచింది

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News