Saturday, March 7, 2026

06/02, 4:52 pm] Narasiah Korutla: *మున్సిపల్ ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించాలి** ఎన్నికల ప్రక్రియపై అధికారులకు సంపూర్ణ అవగాహన ఉండాలి* ఆర్వోలు, ఏఆర్వోలు, కౌంటింగ్ సిబ్బందికి శిక్షణలో జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ సూచనలు—

[*నేటి సాక్షి – జగిత్యాల బ్యూరో*( రాధారపు నర్సయ్య )జగిత్యాల జిల్లాలో నిర్వహించనున్న రెండవ సాధారణ మున్సిపల్ ఎన్నికలను ఎలాంటి లోపాలు లేకుండా, నిబంధనలకు అనుగుణంగా సమర్థవంతంగా నిర్వహించాల్సిన బాధ్యత అధికారులపై ఉందని జిల్లా కలెక్టర్ ,జిల్లా ఎన్నికల అధికారి బి. సత్యప్రసాద్ స్పష్టం చేశారు. ఎన్నికల విధుల నిర్వహణలో ఉన్న ప్రతి అధికారి ఎన్నికల ప్రక్రియపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని ఆయన సూచించారు.*శిక్షణ కార్యక్రమం నిర్వహణ*శుక్రవారం జగిత్యాల కలెక్టరేట్‌లోని ఆడిటోరియంలో జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి బి. సత్యప్రసాద్ ఆధ్వర్యంలో ఆర్వోలు, ఏఆర్వోలు, కౌంటింగ్ అధికారులు, సూపర్వైజర్లు, అసిస్టెంట్ సూపర్వైజర్లకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ శిక్షణలో ఎన్నికల విధుల నిర్వహణపై అధికారులకు స్పష్టమైన అవగాహన కల్పించారు.*వీడియో పవర్ ప్రెజెంటేషన్ ద్వారా దిశానిర్దేశం*ఈ శిక్షణ కార్యక్రమంలో వీడియో పవర్ ప్రెజెంటేషన్ ద్వారా ఎన్నికల ప్రక్రియను వివరంగా వివరిస్తూ, పోలింగ్ నుంచి కౌంటింగ్ వరకు అనుసరించాల్సిన విధానాలపై జిల్లా కలెక్టర్ దిశానిర్దేశం చేశారు. ప్రతి అధికారి తమ విధులపై స్పష్టత పొందేలా శిక్షణను నిర్వహించారు.*నిబంధనలపై సంపూర్ణ అవగాహన అవసరం*ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ మాట్లాడుతూ, మున్సిపల్ ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించాలంటే ఎన్నికల నిబంధనలపై పూర్తి అవగాహన ఉండటం అత్యంత అవసరమని అన్నారు. ఎన్నికల నిర్వహణలో పోలింగ్ అత్యంత కీలక అంశమని, ప్రతి దశ నిబంధనల ప్రకారమే జరిగేలా అధికారులు బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు.*ప్రచార అనుమతులపై స్పష్టత*ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులకు సంబంధించిన కరపత్రాలు, గోడ పత్రాలు, ప్రచార వాహనాల అనుమతుల కోసం సంబంధిత అధికారులను తప్పనిసరిగా సంప్రదించాలని తెలిపారు. శిక్షణ పొందుతున్న ప్రతి అధికారి, తమకు కలిగే సందేహాలను శిక్షణ సమయంలోనే నివృత్తి చేసుకొని పూర్తి స్థాయి అవగాహనతో ట్రైనింగ్ హాల్ నుంచి బయటకు వెళ్లాలని సూచించారు.*పోలింగ్ – కౌంటింగ్‌లో కీలక అంశాలు*మున్సిపల్ ఎన్నికల్లో ఎన్నికల ప్రవర్తనా నియమావళిని కచ్చితంగా అమలు చేస్తూ, ఎలాంటి పొరపాట్లు జరగకుండా అధికారులు సమన్వయంతో క్షేత్ర స్థాయిలో పనిచేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు.పోలింగ్ సమయంలో మైక్రో అబ్జర్వర్లు మరియు వెబ్ క్యాస్టింగ్ పాత్ర అత్యంత కీలకమని, పోలింగ్‌కు అవసరమైన అన్ని రకాల మెటీరియల్‌, పత్రాలను డిస్ట్రిబ్యూషన్ సెంటర్‌లోనే పూర్తిగా సమకూర్చుకోవాలని సూచించారు.*కౌంటింగ్ ఏర్పాట్లపై ఆదేశాలు*కౌంటింగ్ రోజున కౌంటింగ్ అధికారులు అవసరమైన అన్ని ఏర్పాట్లు ముందుగానే పూర్తి చేయాలని, పోలింగ్ మరియు కౌంటింగ్ ప్రక్రియలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా అన్ని రకాల చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ స్పష్టం చేశారు.ఈ శిక్షణ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) బి. రాజ గౌడ్, జిల్లా నోడల్ అధికారి రవికుమార్, టీవో టీలులు, జిల్లా ఎన్నికల విభాగం సిబ్బంది, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.———[06/02, 5:04 pm] Md Imam. Narayanapet: చిత్తనూరు విత్తనాల కంపెనీని ఎత్తివేయాలి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న చిత్తనూరు విత్తనాల కంపెనీ ఎత్తివేయాలి…. మందిపల్లి ఉప సర్పంచ్ చెట్టు కింది నరేష్ కుమార్…. సాక్షి, నారాయణపేట, ఫిబ్రవరి 6, ,( రిపోర్టర్ ఇమామ్ సాబ్ ), నారాయణపేట జిల్లాలోని మరికల్ మండలంలోని చిత్తనూరు విత్తనాల ఫ్యాక్టరీ నుంచి విడుదలయ్యే పొగ వల్ల కాలుష్యం పెరిగి దుర్వాసన భరించలేకపోతున్నామని ధన్వాడ మండలం మందపల్లి గ్రామ ఉపసర్పంచ్, ధర్మ సమాజ్ పార్టీ ధన్వాడ మండల అధ్యక్షులు చెట్టు కింది నరేష్ కుమార్ తెలిపారు. శుక్రవారం ధన్వాడలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ధన్వాడ మండలంలోని మందిపల్లి గ్రామంలో ప్రతిరోజు చిత్తనూరు విత్తనాల ఫ్యాక్టరీ ద్వారా ఉదయం… సాయంత్రం… చాలా ఎక్కువగా దుర్వాసన వెదజల్లుతుందని ఆయన వివరించారు.ఈ విష గాలుల వల్ల చుట్టుముట్టు ఉన్న గ్రామాలలో చెట్లు, ఎండిపోతున్నాయని ఆయన తెలిపారు. అందువలన రాబోయే రోజుల్లో వర్షాలు తగ్గి ఆక్సిజన్ లోపం ఎదురయ్యే అవకాశం ఉంది, అలాగే ప్రజలు వివిధ అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది, ముఖ్యంగా రైతుల పంటలు దిగుబడి తగ్గే అవకాశం ఉంది , ప్రజల ప్రాణాలతో చెలగాటం వద్దు దయచేసి ఫ్యాక్టరీని మూసివేయాలి లేదంటే పెద్ద ఎత్తున భారీ కార్యక్రమాలు చేపడతాం అని తెలిపారు, అధికారుల స్పందించి చిత్తనూరు విత్తనాల కంపెనీని ఎత్తివేయాలి అన్నారు లేని ఎడల ధర్మ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో ధన్వాడ, మరికల్ మండలాల్లో దశలవారికి ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని ఆయన హెచ్చరించారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News