Friday, March 6, 2026

09/02, 7:06 pm] Harish Dharmaram: *ధర్మారం ఆదర్శ పాఠశాల ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

[*నేటి సాక్షి, ధర్మారం (ఫిబ్రవరి 9) : పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాల ఆరవ తరగతి ప్రవేశం, ఏడవ తరగతి నుండి పదవ తరగతి వరకు మిగిలి ఉన్న సీట్ల కొరకు అర్హత గల విద్యార్థులు ఆన్లైన్ లో అప్లయ్ చేసుకోవాలని సోమవారం ప్రిన్సిపాల్ ఈరవేణి రాజ్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ.. 2026-27 అకడమిక్ సంవత్సరానికి గాను ధర్మారం ఆదర్శ పాఠశాలలో ఆరవ తరగతి, ఏడు నుండి పదవ తరగతి వరకు మిగిలి ఉన్న సీట్ల ప్రవేశాల కోసం ఎదురుచూస్తున్న అర్హత కలిగిన మండల విద్యార్థిని విద్యార్థులు సంబంధిత తెలంగాణ మోడల్ స్కూల్ అధికారిక tgms.telngana.gov.in వెబ్ సైట్ లో ఫిబ్రవరి 28 వరకు ఆన్లైన్ లో అప్లయ్ చేసుకోవాలని అన్నారు. అప్లయ్ చేసుకున్నవారికి ఏప్రిల్ 19 ఆదివారం రోజున ఉదయం 6వ తరగతి కొరకు మధ్యాహ్నం 7నుండి 10 వ తరగతి లో ప్రవేశం కొరకు పరీక్ష స్థానిక ధర్మారం ఆదర్శ పాఠశాలలో నిర్వహిస్తారని పేర్కొన్నారు. అప్లై చేసుకునే విద్యార్థులు వారి తల్లి తండ్రులకు మరింత సమాచారం, సందేహాలను నివృత్తి చేసుకొనుటకు ఆదర్శ పాఠశాల లో సంప్రదించవచ్చని ధర్మారం మండల అర్హత గల విద్యార్థిని విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.[09/02, 7:07 pm] Ravi kishor Nandhayala: జనాలగూడెం బాధితులకు నిత్యవసర వస్తువులు, కూరగాయలు పంపిణీ చేసిన పి.వి.రావు మాల మహానాడు కమిటీ కార్యవర్గ సభ్యులు డాక్టర్ డి.వెంకటేష్……..నేటి సాక్షి 09 ఫిబ్రవరి కొత్తపల్లి:- కొత్తపల్లి మండలంలోని, జానాల గూడెంలో గత నెలలో అగ్రవర్ణాల కుట్రలో భాగంగా దళితులను అక్రమంగా అరెస్టు చేసి రిమాండ్ కు పంపించడం జరిగింది. వారి కుటుంబాల బాధితులకు అండగా పి.వి.రావు మాల మహానాడు కమిటీ కార్యవర్గ సభ్యులు డాక్టర్ డి.వెంకటేష్, తదితర నాయకులు పరామర్శించి, వారికి అండగా ఉంటామని భరోసా ఇవ్వడమే కాకుండా, న్యాయపరంగా బాధితులకు అండగా ఉంటామని మాల మహానాడు నాయకులు హామీ ఇవ్వడం జరిగింది. అనంతరం జనాల గూడెం బాధితులకు కొంతమంది దాతల సహకారంతో నిత్యవసర వస్తువులు, కూరగాయలు మాల మహానాడు నాయకులతో కలిసి అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాములపాడు మండలం నుండి మాల మహానాడు రాయలసీమ అధ్యక్షుడు కలబండి.చిన్న అంకన్న, సమాజ సేవకుడు కలబండి.నాగరాజు, జాతీయ మాల మహానాడు రాయలసీమ అధ్యక్షుడు నల్లమల.అబ్రహం, మిత్తూరు మండలం నాయకులు దేవ, నాగరాజు, జూపాడుబంగ్లా మండలం నాయకులు మాధవరం రంగస్వామి, పి.రంగయ్య, కొత్తపల్లి మండలం నాయకులు మల్రెడ్డి రవికుమార్, మధు, అరే రాజు,తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News