నేటి సాక్షి ప్రతినిధి సుధాకర్ గౌడ్ శంకర్పల్లి న్యూస్ రంగారెడ్డి జిల్లా, శంకర్పల్లి మండలం, రావులపల్లి కలాన్ గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక గృహ జ్యోతి పథకంను గ్రామ సర్పంచ్ వానరసి సువర్ణ కృష్ణమూర్తి ఆధ్వర్యంలో అర్హులైన లబ్ధిదారులకు అందజేశారు. ఈ కార్యక్రమం గ్రామంలో ఉత్సాహభరిత వాతావరణంలో నిర్వహించబడింది.ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ బొజ్జ సరిత వెంకట్ రెడ్డి ప్రత్యేకంగా పాల్గొని మాట్లాడారు. గృహ జ్యోతి పథకం ద్వారా పేద మరియు మధ్యతరగతి కుటుంబాలకు విద్యుత్ ఖర్చుల భారం తగ్గుతుందని, ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు చేరువ చేయడమే లక్ష్యమని ఆమె తెలిపారు.గ్రామంలోని వివిధ వార్డ్ నెంబర్లకు చెందిన వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. లబ్ధిదారులు ప్రభుత్వానికి, గ్రామ పాలకవర్గానికి కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ సందర్భంగా సర్పంచ్ వానరసి సువర్ణ కృష్ణమూర్తి మాట్లాడుతూ, గ్రామాభివృద్ధి మరియు ప్రజా సంక్షేమమే తమ ప్రధాన ధ్యేయమని తెలిపారు. భవిష్యత్తులో కూడా ప్రతి అర్హ కుటుంబానికి ప్రభుత్వ పథకాలు అందేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు.

