నేటిసాక్షి ప్రతినిధి చందుర్తి:
చందుర్తి మండలం మల్యాల గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆటల పోటీలు నిర్వహించిన నేపథ్యంలో విద్యార్థులకు ప్రోత్సాహకంగా బహుమతులను అందించడానికి ప్రముఖ ఎన్నారై అనపర్తి రాజు తన వంతుగా ఆర్థిక సహాయంగా రూ. 10.000/ ప్రధానోపాధ్యాయులు శరత్ చంద్రకు అందజేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఈసరి శ్రీనివాస్, మాజీ వార్డు సభ్యులు ప్రసాద్,సతీష్, సుధాకర్, దివ్యసాగర్, మధు, సుమన్, మధు, గంగాధర్, నరేందర్, శంకర్, శ్రీనివాస్, రాజు, ఉపాధ్యాయుల బృందం, సేవా సమితి సభ్యులు విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.





