ఇల్లు మంజూరు చేయలేదు.
ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తే అప్పు చేసైనా ఇల్లు కట్టుకుంటా…..
నేటి సాక్షి. నారాయణపేట. జూన్ 25.
నారాయణపేట జిల్లాలోని ధన్వాడ మండల పరిధిలోని మంది పల్లి గ్రామంలో కులానికి చెందిన కడపయ్య అనే రైతు ఇందిరమ్మ ఇల్లు కోసం గత 100 సార్లు చేసుకున్న తనకు మంజూరు చేయలేకపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. నారాయణపేట నియోజకవర్గం ఎమ్మెల్యే గారు స్పందించి తనకు ఇల్లు మంజూరు చేస్తే అప్పు చేసిన సరే రేకుల షెడ్డు తొలగించి ఇల్లు కట్టుకుంటానని దళిత రైతు కడపయ్య ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం రేకుల ఇంటిలో నివాసం ఉంటున్నాడని వర్షాకాలంలో కారుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారుల చుట్టూ తిరిగిన పట్టించుకోవడం లేదన్నారు. ఇకనైనా అధికారులు స్పందించి మంజూరు చేయిస్తే అప్పు చేసిన కట్టుకోవడానికి సిద్ధమేనని ఆవేదన వ్యక్తం చేశారు.





