నేటి సాక్షి,బెజ్జంకి:
దేశంలో బ్రిటిష్ వలసవాదులు దేశాన్ని వదిలి వెళ్లాలని, స్వరాజ్యం మా జన్మ హక్కు అని, పోత్తిళ్లలో పిడికిలి బిగించి కాంగ్రెస్ లో ఉంటూనే అతి వాద భావాలతో పోరాడుతున్న వారంతా ఐక్యమై వారితో కమ్యూనిస్టు పార్టీని 1925 డిసెంబర్ 25న కాన్పూర్లో నిర్మాణం చేయడం జరిగింది. తెల్ల దొరలను తరిమి కొట్టినానంతరం అధికార మార్పిడితో బూర్జవ పార్టీ దేశంలో అధికారంలోకి వచ్చిన, సోషలిజం ధ్యేయంగా ప్రజాస్వామ్యం ప్రాణంగా మీరాట్ కుట్ర కేసు జలియన్ వాలాబాగ్ కుట్ర కేసు నిర్బంధాలను జైళ్లను ఎదుర్కొంటూ, పార్టీ నిర్మాణాన్ని పెంచుకుంటూ 100 సంవత్సరాలు పూర్తి చేసుకునీ, సుదీర్ఘ పోరాటాల చరిత్ర కలిగిన పార్టీ సిపిఐ పార్టీ అని బొనగిరి రూపేష్ అన్నారు. శుక్రవారం గుగ్గిళ్ళ, పోతారం, తిమ్మాయపల్లి గ్రామాలలో గ్రామ శాఖ ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు సంఘం మధు, పోతారం గ్రామ కార్యదర్శి నిశాని శివకుమార్, లింగాల శ్రీనివాస్, శ్రీకాంత్, చిట్టి శ్రీనివాస్ కేడిక మధు, మల్లేశం గ్రామాల కార్యకర్తలు పాల్గొన్నారు.

