Tuesday, January 20, 2026

భారత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పాయ్ 100 వ జయంతి

  • భారతీయ జనత పార్టీ శ్రేణుల నివాళులు

నేటి సాక్షి ప్రతినిధి వనపర్తి : బుధవారం భారత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పాయ్ శతజయంతి సందర్భంగా పట్టణ కమిటీ ఆధ్వర్యంలో వారి చిత్రపటానికి ఘనంగా నివాళులు, యువ మోర్చా ఆధ్వర్యంలో జిల్లా ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ మరియు ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో అయ్యప్ప దేవాలయంలో స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా బిజెపి జిల్లా అధ్యక్షుడు డి. నారాయణ మాట్లాడుతూ బీజేపీ వ్యవస్థాపకులు మాజీ ప్రధానమంత్రి భారతరత్న స్వర్గీయ ఏ.బి. వాజ్ పాయ్ చేతుల మీదుగా పురుడు పోసుకున్న బిజెపి నేడు దేశంలో 70% రాష్ట్రాలలో అధికారం లో ఉందని వాజ్ పాయ్ ఆశయ సాధనకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విశేష కృషి చేస్తున్నారని ఆర్టికల్ 370 ట్రిపుల్ తలాక్ మహిళా రిజర్వేషన్ బిల్లు అమల్లోకి తీసుకొచ్చి వాజపేయి కి ఆశయాలను సాధ్యం చేశారని గుర్తు చేశారు.అటల్ అటల్ బిహారీ వాజ్పేయి సుదీర్ఘకాలం భారత రాజకీయాలలో అజాతశత్రువుగా వెలుగొందారని మొదటిసారి 13 రోజులు రెండవ పర్యాయం 13 నెలలు ఎన్డీఏ సారథ్యంలో ప్రధానమంత్రిగా అధికారంలో ఉండి నాటి కాంగ్రెస్ రాజకీయ చదరంగ విశ్వాస పరీక్షలో ఒక్క ఓటుతో ఓడిపోయి, ధైర్యంగా ఎన్నికలకు వెళ్ళిన నిస్వార్థ రాజకీయ నాయకుడు వాజ్పేయి గారని ప్రత్యర్ధులు కూడా ఆరోపణ చేయలేని అజాతశక్తువుగా రాజనీతిజ్ఞుడుగా వెలుగుందారని రాజకీయరంగంలో ఎంత సౌమ్యంగా ఉన్నా పొరుగు దేశాలతో సత్సంబంధాలు నెలకొల్పేలా పాకిస్తాన్ కు బస్సు ప్రయాణానికి చొరవ తీసుకుంటే కుక్క బుద్ధి చూపించిన పాకిస్తాన్ కు కార్గిల్ యుద్ధంలో ముచ్చెమటలు పట్టించి వారి భూభాగంలోకి 13 కిలోమీటర్ల మేర చొచ్చుకుపోయి పాకిస్తాన్ కి చావు దెబ్బ తినిపించి దేశ రక్షణ విషయంలో రాజీ పడేది లేదని తేల్చి చెప్పిన మహా నాయకుడు మహా మేధావి వాజ్ పాయ్ ని వారి ఆశయాలకు అనుగుణంగా భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో బిజెపి జిల్లా అధ్యక్షుడు డి నారాయణ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సబిరెడ్డి వెంకటరెడ్డి జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ ఆర్ లోకనాథ్ రెడ్డి రాష్ట్ర నాయకులు పురుషోత్తం రెడ్డి బి శ్రీశైలం జిల్లా నాయకులు బి కుమారస్వామి, ఏ. సీతారాములు, మని వర్ధన్, గోపీనాథ్ యాదవ్, రాజశేఖర్ గౌడ్, కృష్ణ గౌడ్, ఎం.డి. ఖలీల్ పట్టణ నాయకులు బచ్చు రాము, సూగురు రాములు, రాయన్న, ఎద్దుల రాజు, భూపతి గౌడ్, నవీన్ చారి, విజయసాగర్, రవి, తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News