Saturday, March 21, 2026

11వ తారీఖున తంబళ్లపల్లి ఎంపీపీ ఎన్నికలు జరగనున్నాయని ఇంచార్జ్ ఎంపీడీవో వెల్లడి ..

నేటి సాక్షి పత్రిక పాత్రికేయులు శర్మ, అన్నమయ్య జిల్లా, డిసెంబర్ 09 ~అన్నమయ్య జిల్లా :-: స్థానిక నియోజకవర్గ పరిధిలోని తంబళ్లపల్లి ఎంపీపీ ఎన్నిక ఈనెల 11వ తేదీన జరగనున్నట్లు ఎంపీడీవో బాపూజీ పట్నాయక్ మంగళవారం మీడియాకు వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తంబళ్లపల్లి మాజీ ఎంపీపీ అనసూయమ్మ ఈఏడాది అక్టోబర్ 13న తన వ్యక్తిగత కారణాలవల్ల ఎంపీపీ పదవికి రాజీనామా చేశారని ఎంపీపీ అనసూయమ్మ పై పది మంది ఎంపీటీసీలు అవిశ్వాసం ప్రకటించడంతో అక్టోబర్ 27వ తేదీన ఎంపీడీవో పట్నాయక్ మెజారిటీ ఎంపీటీసీల ఆమోదంతో జడ్పీ సీఈవో రవికుమార్ నాయుడు ఆదేశాల మేరకు కోసువారిపల్లి ఎంపీటీసీ మండల ఉపాధ్యక్షురాలు చిటికి శ్యామలమ్మను ఇంచార్జ్ మండల పరిషత్ అధ్యక్షురాలుగా ప్రమాణ స్వీకారం చేయించామని ఆయన తెలిపారు. కానీ రాష్ట్ర ఎన్నికల కమిషన్ పలు మండల పరిషత్ అధ్యక్షుల ఎన్నికలు ఈనెల 11వ తారీకున గురువారం 11 గంటలకు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఉమ్మడి జిల్లాలైన చిత్తూరు జిల్లా లోని విజయపురం, నిండ్ర, తిరుపతి జిల్లా లోని ఏర్పేడు, వరదయ్యపాలెం, సత్యవేడు తో బాటు అన్నమయ్య జిల్లా లోని తంబళ్లపల్లి ఎంపీపీ ఎన్నికలు జరగనున్నాయని ఎంపీడీవో తెలిపారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఈనెల 11వ తారీకున గురువారం 11 గంటలకు మండలంలోని 11 మంది మెజారిటీ ఎంపీటీసీలు ఆమోదంతో ఎంపీపీ ఎన్నిక నిర్వహించనున్నట్లు ఎంపీడీవో బాపూజీ పట్నాయక్ విలేకరులకు తెలిపారు. ఈ ఎన్నిక నిర్వహణ తంబళ్లపల్లె స్పెషలాఫీసర్ డిఎల్డిఓ అమరనాథరెడ్డి సారథ్యంలో జరగనుందని ఈ సందర్భంగా 11 మంది ఎంపీటీసీ సభ్యులకు మాత్రమే అనుమతుంటుందని ఆయన వెల్లడించారు. ఎన్నికలు సజావుగా సాగేందుకు గట్టి భద్రత ఏర్పాట్లు చేస్తున్నట్టు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఎంపీడీవో కార్యాలయం వద్ద గట్టి భద్రత మధ్య పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు ఎంపీడీవో బాపూజీ పట్నాయక్ విలేకరులకు తెలిపారు..~~~~~~~~~~~~~~~~~

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News