[నేటి సాక్షి అన్నమయ్య జిల్లా, శర్మ, డిసెంబర్ 11 ~అన్నమయ్య జిల్లా :-: వైయస్ఆర్ కేడర్ కు కోటి సంతకాల నిరసన పోరాటం చైతన్యం కలిగించింది. కానీ ఇండిగో పరిణామాలు రాష్ట్రాన్ని నిరాశకు గురిచేశాయి. వైద్య కళాశాలలను ప్రైవేటీకరిస్తూ కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం, దానిని వ్యతిరేకిస్తూ నిరసన కార్యక్రమాలను చేపట్టాలని, కోటి సంతకాల సేకరణ చేయాలని రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పిలుపునివ్వడం ఆ పిలుపును వైఎస్ఆర్ సీపీ కేడర్ దూకుడుతో వైసీపీ శ్రేణుల్లోనే కాకుండా రాష్ట్ర ప్రజల్లో చైతన్యాన్ని కలిగించిందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఓటమితో కుంగిపోతూ నిరాశలో ఉన్న కేడర్ కు ఈ పిలుపు ఒక మలుపుగా మారింది. దాదాపు 50రోజులుగా ఈ పోరాటం అంచలంచలగా ముందుకు సాగుతోంది. చిన్న, చితక కార్యకర్తల నుంచి రాష్ట్ర స్థాయి నాయకులు వరకు ఈ పోరాటంలో పాల్గొనడం, ప్రజలకు కూడా ఇది మంచి ప్రేరణ కలిగించే అంశం కావడంతో కలిసొచ్చింది. దానికి తోడు ఇటీవల జాతీయ స్థాయిలో విమాన రంగంలో కలిగిన అపశృతి మరో కలిసొచ్చిన అంశంగా మారింది. దేశంలో ఎప్పుడూ లేని విధంగా విమానాలు రద్దు కావడం, ప్రయాణికులు తీవ్ర ఇక్కట్లు గురి కావడం డిసెంబర్ 3వ తేదీ నుంచి ఈ ప్రతిష్టంబన కొనసాగుతు జాతీయ స్థాయిలో ఇది పెద్ద చర్చనీయాంశం కావడం ఈ నేపథ్యంలోనే ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉద్యమం చేపట్టడం మరింత ఊపునిచ్చింది. విమాన రంగంలో పూర్తిగా ప్రైవేటీకరణకి పెద్దపీట వేయడం, ప్రభుత్వానికి ప్రత్యేక ప్రత్యామ్నాయ ఏర్పాట్లు లేకపోవడం ఫలితంగా ఏకస్వామ్యం ఏర్పడడంతో సుమారు 60 శాతం విమానాలను నడుపుతున్న ఇండిగో సంస్థ కేంద్ర ప్రభుత్వ విమాన శాఖా ఇచ్చిన నిబంధనలను తుంగలో తొక్కడం ఒక ఊతమైతే వారిని ప్రభుత్వం నియంత్రించ లేకపోవడం ఇది ప్రైవేటు సంస్థల అజామాషికి అద్దంపట్టింది. రాబోవు రోజుల్లో ఇదే విధంగా మెడికల్ కళాశాలలోనూ పరిస్థితి ఉండనుందని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజలకు వివరిస్తున్నారు. రాబోవు రోజుల్లో అన్ని కళాశాలలో ప్రైవేటుపరం కావడం వల్ల ఈ రంగంలోనూ ప్రైవేటు ఏకస్వామ్యం తప్పదని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రజలకు విన్నవిస్తున్నాయి. మెడికల్ కళాశాలల నిర్వహణ, ఆసుపత్రుల నిర్వహణలో ప్రైవేటు యాజమాన్యాల మునుముందు పై చేయి కాబోతుందని వీరు ప్రజలకు హెచ్చరిస్తూ వివరిస్తున్నారు. ఇండిగో పరిణామాలతో పోలుస్తూ ప్రజలకు వివరిస్తున్న తీరు ప్రజలకు మరింత చైతన్యం కలిగించడానికి దోహదం చేస్తుంది. వైద్య రంగం నుంచి ప్రభుత్వం మెల్లమెల్లగా తప్పుకోవటం వల్ల జరిగే పరిణామాలకు ఉదాహరణగా దీన్ని నాయకులు కార్యకర్తలు ప్రజల ముందు పెడుతున్నారు. విమాన రంగంలో ప్రభుత్వ విమానాలు నడుచుంటే ఈ పరిస్థితి ఉండేదా అని వారు ప్రశ్నిస్తున్నారు. అన్ని ప్రైవేటు వైమానిక సంస్థలే మొత్తం ప్రయాణాన్ని నియంత్రించడం వలన ఈ పరిస్థితి ఏర్పడిందని వారు అడుగడుగునా ప్రచారం చేస్తున్నారు. దీనికి తోడు జిల్లాలో కాళ్లకు బలపాలు కట్టుకుని అదే పనిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి, ఉమ్మడి జిల్లాల రీజనల్ కో ఆర్డినేటర్, పుంగనూరు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, వైసీపీ ఉమ్మడి జిల్లాల అధ్యక్షుడు భూమన కరుణాకర్ రెడ్డి, తంబళ్లపల్లి శాసనసభ్యులు పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి, ఆక్కేపాటి అమర్ నాథ్ రెడ్డి, సమన్వయకర్తలు, ఇంచార్జులు గడికోట శ్రీకాంత్ రెడ్డి, ఆర్కే రోజా, నిస్సార్ అహ్మద్, చింతల రామచంద్రారెడ్డి, విజయానంద రెడ్డి, వెంకట గౌడ, డాక్టర్ సునీల్, నూకతోటి రాజేష్, కృపా లక్ష్మి పర్యవేక్షణలో రాష్ట్ర స్థాయి పదవి దారుల ఐక్యతలో ఈ కార్యక్రమాన్ని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ కార్యకర్తలను నాయకులను ప్రోత్సహిస్తూ కార్యక్రమాన్ని చురుకుగా తీసుకెళ్లడంలో కృతకృతులయ్యారు. అన్ని నియోజకవర్గాల్లోనూ 50 వేల నుంచి 70 వేల వరకు సంతకాల సేకరణ చేపట్టారు. ఇక్కడున్న కేడర్ అంతా కూడా ఏక తాటిపై వచ్చి నిరసన కార్యక్రమాలను గత 50 రోజులుగా అంచెలంచెలుగా విడత విడతలగా కొనసాగిస్తూ ముందుకు సాగి బుధవారం భారీగా వందలాది మంది వైసీపీ శ్రేణులు, స్వచ్ఛందంగా తరలివచ్చిన ప్రజలతో ర్యాలీలను నిర్వహించి అన్ని నియోజకవర్గాల్లో జన సమీకరించుకొని సేకరించిన సంతకాల పత్రాలను వైసీపీ జిల్లా ప్రధాన కార్యాలయాలకు తద్వారా కేంద్ర పార్టీ కార్యాలయానికి అక్కడ నుంచి గవర్నర్ కు అందించేందుకు ఏర్పాట్లలో భాగంగా జిల్లా కేంద్రాలకు బుధవారం వీటిని తరలించారు. మరల ఈ నెల 15న జిల్లా కేంద్రాల్లోనూ భారీ ర్యాలీలు నిర్వహించి రాజధానికి పత్రాలను అప్పగించే కార్యక్రమానికి కూడా రూపకల్పన చేశారు. ఈ విధంగా కార్యకర్తలను అడుగడుగులు తట్టి లేపుతూ కార్యక్రమాన్ని దిగ్విజయంగా కొనసాగించారు. ఈ కార్యక్రమం నిస్తేజంలో ఉన్న పార్టీకి ఉత్తేజాన్ని కలిగిస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇది ప్రజా అవసరాలకు ప్రజాభిస్టానికి అనుకూలమైన అవసరం విద్యా వైద్య రంగాలు ప్రైవేటు రంగంలో ఉంచాలన్న రాజ్యాంగ స్ఫూర్తికి ఈ పోరాటం ఒక మైలేజ్ మైలురాయి జీవించే హక్కును కాల రాసే చర్యగా దీన్ని నిరసించడం ప్రజల హర్షిస్తున్నారు..~~~~~~~~~~~~~~~~[11/12, 3:21 pm] Mohammad Mobin. Asifabad: పత్రిక ప్రకటనకొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాతేదీ : 11-12-2025నేటి సాక్షి కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో మొదటి విడత జరుగుతున్న గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లను మరింత బలోపేతం చేయడానికి పోలీసు శాఖ విస్తృత చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో జైనూర్ మండల కేంద్రంలోని ZPHS పోలింగ్ కేంద్రాన్ని ఆసిఫాబాద్ ఎఎస్పీ చిత్తరంజన్ గురువారం సందర్శించారు.పోలింగ్ కేంద్రానికి చేరుకున్న ASP గారు అక్కడి పరిస్థితులను, భద్రతా బందోబస్తును, పోలింగ్ ప్రక్రియను పరిశీలిస్తూ సిబ్బందితో మాట్లాడారు. ఎన్నికలు పూర్తయ్యే వరకు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.పోలింగ్ కేంద్రాల వద్ద అప్రమత్తంగా ఉండాలని, చట్టం & శాంతిభద్రతల పరిరక్షణనే ప్రాధాన్యంగా తీసుకోవాలని,నిబంధనలు ఉల్లంఘించే అసాంఘిక కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలిపారు.

