(నేటి సాక్షి) డిసెంబర్ 06: ప్రతినిధిరాజేంద్రనగర్ నియోజకవర్గం నార్సింగి మున్సిపల్ జొన్నాడ గ్రామ పరిధిలో పేద్ద ఎత్తున కన్వెన్షన్ నిర్మాణ పనులు చక చక జరుగుతున్నాయి. నిబంధనలు ఏమాత్రం పట్టించు కోకుండా దర్జాగా కన్వెన్షన్ నిర్మాణం చేపట్టారు.ఇక్కడ ఎలాంటి నిర్మాణాలు చేపట్టకుండా 111 జీవో అమలులో ఉంది.అయిన ఈ నిబంధనలు పట్టించు కోకుండా మున్సిపల్ అధికారులను ప్రసన్నం చేసుకుని నిర్మాణం చేపడుతున్నారు. ఈ నిర్మాణంపై మున్సిపల్ అధికారులకు పలుమార్లు ఫిర్యాదులు అందాయి అయినా ఇలాంటి చెల్లెలు చూసుకోవడం లేదని ఆరోపణలు ఉన్నాయి. కన్వెన్షన్ నిర్మాణం విషయంలో భారీగా ముడుకులు అన్యాయాన్ని విమర్శలు ఉన్నాయి. ఆమ్యామ్యాలకు అలవాటు పడి అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవడం లేదని అక్కడి ప్రజలు ఆరోపణలు చేస్తున్నారు. ఇప్పటికైనా ఈ అక్రమ కన్వెన్షన్ పై తక్షణమే చర్యలు తీసుకోవాలని ప్రజల నుండి డిమాండ్లు వినిపిస్తున్నాయి.





