Saturday, January 17, 2026

తాళం వేసిన ఇంటిలో 12 తులాల బంగారు ఆభరణాలు అపహరణ

  • అపహరణ చేసిన నిందితురాలు అరెస్ట్
  • 24 గంటలలో కేసును చేదించిన పోలీసులు
  • వనపర్తి సీఐ కృష్ణ
  • వనపర్తి రూరల్ ఎస్సై జలంధర్ రెడ్డి

నేటి సాక్షి ప్రతినిధి వనపర్తి : వనపర్తి పట్టణ కేంద్రంలో ఎనిమిదో వార్డులో తాళం వేసిన ఇంటిలో 12 తులాల బంగారు ఆభరణాలు, 4-1/2 ( నాలుగున్నర) తులాల వెండి పట్టీలు, 18,900 వందల రూపాయలు దొంగిలించారు. నగలు డబ్బు పోయాయని వనపర్తి రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ ఐపీఎస్ మరియు వనపర్తి డిఎస్పి వెంకటేశ్వర్ రావు, డిసిఆర్బి డిఎస్పి ఉమామహేశ్వరరావు పర్యవేక్షణలో వనపర్తి సీఐ కృష్ణ ఆధ్వర్యంలో వనపర్తి రూరల్ ఎస్సై జలంధర్ రెడ్డి కేసును పర్యవేక్షించారు.వనపర్తి రూరల్ పిఎస్,క్రైమ్ నెంబర్ 05/2025 యూ /ఎస్ 331(3), 305 బిఎన్ఎస్,ఆఫ్ పిఎస్ వనపర్తి రూరల్ నేరం జరిగిన తేదీ 6-01-2025, వ రోజు 3:30గంటలకు.నివేదిక తేదీ07-01-2025 న 09.00 గంటలకు. ఫిర్యాదురాలి వివరాలు: అల్వాల లక్ష్మి భర్త నరసింహ గౌడ్, వయసు 30 సంవత్సరాలు, కులం గౌడు, వృత్తి కూలీ, 8వ వార్డు లక్ష్మీనరసింహ కాలనీ వనపర్తి పట్టణం, నిందితురాలి వివరాలు : గోపాల మహేశ్వరి భర్త జి. వయసు 45 సంవత్సరాలు, కులం కురువ, వృత్తి కూలీ, గ్రామం తీగలపల్లి, మండలం కోడేరు, జిల్లా నాగర్ కర్నూల్, పిర్యాదురాలి భర్త నరసింహ గౌడ్ గత (6) ఆరు సంవత్సరాల క్రితం వనపర్తి లోని లక్ష్మీనరసింహ కాలనీ యందు ఒక ఇంటిని కొనుగోలు చేసి అందులోనే తన భర్తతో పాటు ఉంటూ శ్రీనివాసపురం లోని ఉన్న ఒక కళ్ళు దుకాణంలో నెల జీతం లాగా పని చేస్తున్నది, తన భర్త నరసింహ గౌడ్ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంటాడు, అయితే తన బంగారు ఆభరణాలను బంగారం షాపు వాళ్లు ఇచ్చిన ఒక నీలం రంగు సంచిలో పెట్టి అట్టి సంచిని వారి బెడ్ రూమ్ లోని కబోర్డులో దాచి పెట్టి ఆమె రోజు కళ్ళు దుకాణంలో కళ్ళు అమ్మగా వచ్చిన డబ్బులు కూడా రాత్రికి అదే సంచిలో పెట్టి తిరిగి మరుసటి రోజు ఉదయం కళ్ళు దుకాణం యజమానికి ఇస్తుండేదని , మరియు వారి ఖర్చులకు ఉంచుకునే డబ్బులు కూడా అదే సంచిలో పెట్టేవారు అయితే ఫిర్యాదురాలు రోజు కళ్ళు దుకాణం కు వెళ్లే ముందు వారి ఇంటికి తాళం వేసి, తాళం చెవిని వారి ఇంటి బయట ఉన్న చెప్పుల బాక్సులో పెట్టి కళ్ళు దుకాణంకు వెళ్లగా ఆమె భర్త మధ్యాహ్నం ఇంటికి వచ్చి అన్నం తిని మళ్లీ ఇంటికి తాళం వేసి తాళం చెవి యధావిధిగా చెప్పుల బాక్స్ లో పెట్టి వెళ్ళినాడు. రోజులాగే సోమవారం 6-1- 2025 రోజు ఉదయం 9 గంటలకు ఫిర్యాదురాలు కల్లు దుకాణం కు వెళ్లి తిరిగి రాత్రి అందాజ 9 గంటలకు కళ్ళు దుకాణం నుంచి ఇంటికి వచ్చి అట్టి డబ్బులను అదే సంచులో పెట్టటానికి సంచిని తీసి చూడగా అట్టి సంచిలో ఆమె దాచిన తన బంగారు వెండి వస్తువులు మరియు నగదు డబ్బులు కనిపించలేదని, వారి ఇంటికి దగ్గరలో ఉన్న నిందితురాలు తరచు వారి ఇంటికి వస్తూ పోతుండేది, ఆమె పై అనుమానం రాగ ఫిర్యాదు రాలి ఇంటి తాళం చెవి ఎక్కడ పెట్టేది ఆమెకు తెలిసి నిన్న మధ్యాహ్నం 3 గంటల 30 నిమిషాలకు ఫిర్యాదు రాలి ఇంటిలో ఎవరూ లేనిది చూసి వారి ఇంటికి వెళ్లి చెప్పుల బాక్స్ లో ఉన్న తాళంచెవి తీసుకొని ఇంట్లోకి వెళ్లి ఫిర్యాదురాలు దాచిపెట్టిన ఆమె బంగారు, వెండి,నగదు, రూపాయలను దొంగలించుకుని వెళ్ళినది. వనపర్తి రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇవ్వగా దొంగతనం చేసింది ఎవరో అని తెలుసుకొని నేరం జరిగిన 24గంటల లోపే వనపర్తి సీఐ కృష్ణ ఆధ్వర్యంలో వనపర్తి రూరల్ ఎస్సై జలంధర్ రెడ్డి కేసును చేదించారు. నిందితురాలని పట్టుకుని రిమాండ్ కు తరలించారు. బంగారు ఆభరణాలు 12 తులాలు వాటి విలువ 8,40,000 వేల రూపాయలు, వెండి పట్టీలు 4-1/2 తులాలు వాటి విలువ 4,500 వందల రూపాయలు, ఇంటిలో నగదు 18,900 వందల రూపాయలు, ఆ ఇంటిలో మొత్తం దొంగలించబడినది 8,63,400వందల రూపాయలు నిందితురాలు దొంగిలించినది. పోలీసులు ఆమె దొంగిలించిన అన్నింటిని బంగారాన్ని డబ్బులను రికవరీ చేయడం జరిగింది.ఈ సందర్భంగా కేసును చేదించడంలో హెడ్ కానిస్టేబుల్ సుగుణ, కానిస్టేబుల్ ప్రవీణ, కానిస్టేబుల్ అంజి ని ఈ ముగ్గురుని డీఎస్పీ అభినందించారు. ఈ కేసులో ముగ్గురికి రివార్డ్స్ ప్రకటించారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News