నేటి సాక్షి ఉమ్మడి వరంగల్
(సందెల రాజు)
రాష్ట్ర రెవెన్యూ గృహ నిర్మాణ శాఖామంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, శాసన సభ్యులు కే ఆర్ నాగరాజు, యశస్విని రెడ్డి తో కలసి వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం తోనే ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందుతున్నాయని అన్నారు. ఇల్లు ఇస్తామని గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో నాయకులు10 సంవత్సరాలు ప్రజలను మోసం చేశారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో రాష్ట్రంలో ఇల్లు లేని వారందరికీ ఇందిరమ్మ ఇల్లు నిర్మిస్తున్నామని తెలియజేసారు. రైతు రుణమాఫీ, రైతు భరోసా, రాజీవ్ యువ వికాసం, సన్న బియ్యం ఇలా ప్రతి ఇంటికి రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో వేల కోట్లు ఖర్చు చేస్తుందని తెలిపారు. గత బి ఆర్ ఎస్ ప్రభుత్వం చేసిన 7 లక్షల కోట్ల అప్పులకు కాంగ్రెస్ ప్రభుత్వం వడ్డీలు కడుతూనే రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ పథకాలు కొనసాగిస్తుందని ఎంపీ డా. కడియం కావ్య తెలియజేసారు. దాదాపు 20 ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న అనేక సమస్యలను కాంగ్రెస్ ప్రభుత్వం పరిష్కరిస్తుందని తెలియజేశారు. కాంగ్రెస్ పాలనలో వరంగల్ మహా నగరం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందన్నారు. మామునూరు ఎయిర్పోర్ట్ మెగా టెక్స్టైల్ పార్క్ , కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, వెల్ నెస్ సెంటర్ ఇలా అన్ని రంగాల్లో నగర అభివృద్ధికి కృషి చేస్తున్నామని స్పష్టం చేశారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మద్దతుదారుల గెలుపే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ సమన్వయంతో పనిచేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకుకువెళ్లాలన్నారు. రాయపర్తి మండల అభివృద్ధికి తన ఎంపీ నిధులు కేటాయిస్తానన్నారు.
ఈ కార్యక్రమంలో డిసిసి అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ, టిపీసిసి వైస్ ప్రెసిడెంట్ ఝాన్సీ రెడ్డి, మరియు చైర్మన్లు, ఇతర ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

