- జిల్లా అదనపు కలెక్టర్ సబావత్ మోతిలాల్
నేటి సాక్షి, మంచిర్యాల బ్యూరో:- ప్రభుత్వ ఆదేశానుసారం జిల్లాలో 317 వరి ధాన్యం కొనుగోలు ద్వారా రైతుల నుండి ధాన్యం కొనుగోలు చేసి 147 కోట్ల 24 లక్షల రూపాయల నగదు సంబంధిత రైతుల ఖాతాలలో జమ చేయడం జరిగింది. అని జిల్లా అదనపు కలెక్టర్ సబావత్ మోతిలాల్ ఒక తెలిపారు. జిల్లాలో ప్రతిపాదించిన 326 వరిధాన్యం కొనుగోలు కేంద్రాలలో ఇప్పటి వరకు 317 కొనుగోలు కేంద్రాల ద్వారా 97 వేల 220 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయగా, ఇందులో 39 వేల 658 మెట్రిక్ టన్నుల సన్నరకం ధాన్యం ఉందని, సంబంధిత 10 వేల 472 మంది రైతుల ఖాతాలలో 147 కోట్ల 24 లక్షల రూపాయలు జమ చేయడం జరిగిందని తెలిపారు. జిల్లాలో 26 రైస్ మిల్లులకు సిఎంఆర్ అనుమతులు జారీ చేయడం జరిగిందని తెలిపారు. జిల్లాలోని 296 వరిధాన్యం కొనుగోలు కేంద్రాలలో ధాన్యం కొనుగోలు లక్ష్యం పూర్తి చేసి మూసి వేయడం జరిగిందని తెలిపారు.





