Sunday, January 18, 2026

రాష్ట్ర బడ్జెట్ లో విద్యకు 15 శాతం నిధులు కేటాయించాలి

నేటి సాక్షి ఉమ్మడి వరంగల్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ (సందెల రాజు) : రాష్ట్ర బడ్జెట్లో విద్యా రంగానికి 15 శాతం నిధులు కేటాయించా లని కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టో లో విద్యా రంగానికి 15 శాతం నిధులు కేటాయిస్తామనే హామీ నిలబెట్టు కొవాలని, నిధులు కేటాయించక పోవడం వివక్షతకు దారి చూపుతుందని డిబిఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు చుంచు రాజేందర్, ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షులు కొమ్ముల కర్ణాకర్ అధ్వర్యంలో దామెర తహాసిల్దార్ కార్యాలయం లో తహాసిల్దార్ జ్యోతి వరలక్ష్మి కి వినతిపత్రం ద్వారా ప్రభుత్వానికి తెలిపారు. ఈ సందర్బంగా రాజేందర్, కర్ణాకర్ మాట్లాడుతూ 2024- 25 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ లో కేవలం 7 శాతం నిధులు మాత్రమే కేటాయించారు. రానున్న 2025-26 బడ్జెట్ లోనైనా ఎన్నికల హామీ ప్రకారం 15 శాతం నిధులు కేటాయించి మాట నిలబెట్టు కోవాలన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలో కనీస వసతులు కరువై విద్యార్థులు సమస్యల మధ్య చదువులు సాగిస్తున్నారని అసర్ నివేదిక స్పష్ఠం చెసిందన్నారు. అసర్ నివేదిక ప్రకారం 5.4 శాతం పాఠశాలలో టాయిలెట్స్ లేవని 19 శాతం బడులు పాడు బడ్డాయని పేర్కొన్నది. పాఠశాల లో 27శాతం బాలికలకు ముత్రశాలల సౌకర్యం లేవని అసర్ నివేదిక తేల్చిందన్నారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన 2024 అబ్ స్ట్రాక్ నివేదిక ప్రకారం 11.95 శాతం పిల్లలు డ్రాప్ అవుట్ గా మారి బడి బయట ఉన్నారని తెలియ జేసిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన అంతర్జాతీయ మోడల్ స్కూల్ ల నిర్మాణాలను యుద్ద ప్రాతిపాదికన పూర్తి చేయాలని ప్రతి మండల కేంద్రం లో ప్రారంభించాలని విన్నవిస్తున్నా మన్నారు. గురుకులాలకు, సంక్షేమ వసతి గృహాలకు పక్కా భవనాలను నిర్మించాలని కొరుతున్నామన్నారు. పాఠశాలలో మధ్యాహ్న భోజనం, గురుకులాల లో , సంక్షేమ వసతి గృహాలలో పౌష్టికాహారం అందించాలని ప్రభుత్వ పర్యవేక్షణ మరింత పకడ్బందీగా చేయాలి. ప్రభుత్వ విద్యాలయం లోనాణ్యమైన సమాన విద్యను అందించి ప్రభుత్వ విద్యా వ్యవస్థను పరిరక్షించాలని డిబిఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు చుంచు రాజేందర్, వరంగల్ ఉమ్మడి జిల్లా అద్యక్షులు కొమ్ముల కర్ణాకర్ ప్రభుత్వాన్ని కోరుతున్నామన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News