Saturday, March 14, 2026

నథింగ్ లైక్ ఓటింగ్, ఐ ఓట్ ఫర్ ష్యూర్ అనే థీమ్ తో 15వ జాతీయ ఓటర్ దినోత్సవ వేడుకలు

  • జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష

నేటి సాక్షి, పెద్దపల్లి (వోడ్నాల తిరుపతి);
నథింగ్ లైక్ ఓటింగ్, ఐ ఓట్ ఫర్ ష్యూర్ అనే థీమ్ తో 15వ జాతీయ ఓటర్ దినోత్సవ వేడుకలను పెద్దపల్లి సమీకృత జిల్లా కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో జిల్లా స్థాయిలో నిర్వహిస్తున్నామని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష  గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. భారత ఎన్నికల కమిషన్ జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం ఓటర్ నమోదు పెంపు, ఎథికల్ ఓటింగ్ పై అవగాహన కల్పించేందుకు ప్రతి సంవత్సరం జనవరి 25న జాతీయ ఓటర్ దినోత్సవంగా వేడుకలు నిర్వహిస్తామని, ఈ సంవత్సరం నథింగ్ లైక్ ఓటింగ్, ఐ ఓట్ ఫర్ ష్యూర్ అనే థీమ్ తో వేడుకలు జరుగుతున్నాయని అన్నారు. జిల్లాలోని ప్రతి బూత్ స్థాయి అధికారి పోలింగ్ స్టేషన్ పరిధిలో నూతన ఓటర్లకు ఓటర్ కార్డుల పంపిణీ, వృద్ద ఓటర్ల సన్మానం వంటి కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరుగుతుందని, ప్రతి గ్రామం, వార్డులలో ఓటర్ ప్లేడ్జ్ తీసుకోవడం జరుగుతుందని అన్నారు.సమీకృత జిల్లా కలెక్టరేట్ లోని సమావేశం మందిరంలో జనవరి 25న ఉదయం 11 గంటలకు జరిగే జిల్లా స్థాయి జాతీయ ఓటర్ దినోత్సవ వేడుకలకు హాజరై విజయవంతం చేయాలని కలెక్టర్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News