నేటి సాక్షి, కోటపల్లి:కోటపల్లి మండలంలోని నక్కల పల్లి గ్రామంలో ఆదివాసీల ఆరాధ్య దైవం అయిన మారమ్మా , సడువలమ్మ జాతరను ఈనెల 16, 17 తేదీలలో నిర్వహించనున్నట్లు పూజారి వెంకక్క,పంగిడి లచ్చక్క తెలిపారు.ప్రతి ఏటా వర్షాకాలం మొదలైన తర్వాత సాంప్రదాయ బద్దంగా ఆదివాసీలు దేవతలను ఆట పాటలతో గోదావరి వరకు నడుచుకుంటూ వెళ్లి పుణ్య స్నానం ఆచరించి వస్తారు. ఆ తర్వాత జాతర మొదలవుతుందని, సోమవారం రోజున బోనాలు , ఆట పాట ,మంగళవారం రోజున రథయాత్ర ఉంటుందనీ తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.

