Sunday, January 18, 2026

వనపర్తి జిల్లా కేంద్రంలో 7 కేసులు 17 మంది నిందితులు అరెస్ట్…!

  • జల్సాలకు అలవాటుపడ్డ యువకులు దొంగతనాలకు పాల్పడుతున్నారు
  • ఆన్లైన్ మోసాలు రోజురోజుకు కొత్త పుంతలు తొక్కుతున్నాయి
  • భార్య జల్సాలు ,అప్పులు కట్టేందుకు బ్యాంకులో చోరీకి భర్త ప్లాన్
  • జిల్లా కేంద్రంలో అడుగడుగునా పోలీస్ యంత్రాంగం నిఘా
  • జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ ఐపీఎస్

నేటి సాక్షి ప్రతినిధి వనపర్తి ( గుజ్జుల స్వామి) : వనపర్తి జిల్లా కేంద్రంలో పలు మండలాలలో దారి దోపిడీలు బ్యాంకు దొంగతనాలకు పాల్పడుతున్న యువతి,యువకులు, దొంగతనాలు చేస్తున్నారు. అమరచింత పిఎస్,క్రైమ్ నెంబర్ 146/2024 యూ /ఎస్ 331(4), 305 బిఎన్ఎస్ (బ్యాంకు టెఫ్ట్ ).సంభవించిన తేదీ 26/27.12. 2024 న 0100 గంటలకు.నివేదిక తేదీ30.12.2024న 11.00 గంటలకు. ఫిర్యాదుదారు పేరు పెద్ద యెనుముల శివశంకర్ ఎస్ /వో వెంకటనారాయణ, వయస్సు: 37 సంవత్సరాలు, కులం: బలిజ, ఓసీసీ : యూనియన్ బ్యాంక్ మేనేజర్ అమరచింత, ఆర్ /ఓ . నంద్యాల పాణ్యం మండలం బాపనపాడు గ్రామం,జిల్లా, ఏపీ నిందితుల వివరాలు ఎ-1.పసుల అంకిత డబ్ల్యూ /ఓ జగదీశ్వర్ రెడ్డి, వయస్సు : 23 సంవత్సరాలు, కులం : రెడ్డి, వృత్తి : ప్రైవేట్ ఉద్యోగి, వనపర్తి మండలం మెంటపల్లి గ్రామం. ఎ -2. రాచాల జగదీశ్వర్ రెడ్డి ఎస్ /ఓ లింగారెడ్డి, వయస్సు : 32 సంవత్సరాలు, కులం : రెడ్డి, వృత్తి : రైతు, వనపర్తి మండలం మెంటపల్లి గ్రామం, ఎ-3.రాచల బాస్కర్ రెడ్డి ఎస్ /ఓ బాలకిష్టారెడ్డి, వయస్సు : 42 సంవత్సరాలు, కులం : రెడ్డి, వృత్తి : రైతు, వనపర్తి మండలం మెంటపల్లి గ్రామం.ఎ-4.మండ నాగరాజు ఎస్ /ఓ కురుమన్న, వయస్సు : 43 సంవత్సరాలు, కులం : ఎస్సి మాదిగ, ఒక్క్యూ : మేసన్, వనపర్తి మండలం ఆర్ /ఓ మెంటపల్లి గ్రామం.ఎ -5. కడారి గణేష్ ఎస్ /ఓ గోవింద్, వయస్సు : 19 సంవత్సరాలు, కులం : గొల్ల, ఒక్యూ : విద్యార్థి (బి .టెక్ ) విద్యార్థి ఆర్ /ఓ ఇంటి నెంబర్ 5-49/1, వనపర్తి మండలం కడుకుంట్ల గ్రామం. కేసు వివరములు: తేదీ. 27. 12. 2024 రోజున అమరచింత లో ఉన్న యూనియన్ బ్యాంక్ పని వేళలు ముగిసిన తర్వాత బ్యాంకులో పని చేసేటటువంటి సబ్ మేనేజర్ సతీష్ తన సిబ్బందితో కలిసి అదే రోజు రాత్రి అందాజా 7:30 గంటల సమయంలో బ్యాంకు ను మూసి తాళాలు వేసి వెళ్ళినారు. తర్వాత రెండు రోజులు అనగా తేదీ. 28.12. 2024 మరియు తేదీ. 29.12. 2024 వరుసగా సెలవులు రావడం వలన బ్యాంకు తెరవలేదు. తర్వాత తేదీ.30.12. 2024 రోజున ఉదయం అందాజ 09:45 నిమిషాలకు మేనేజర్ తన సిబ్బందితో కలిసి బ్యాంకు తెరిచి లోపలికి వెళ్లి చూడగా బ్యాంకు యొక్క స్ట్రాంగ్ రూమ్ హ్యాండిల్ విరిగిపోయి పక్కన పడి ఉన్నది. మరియు సీసీ కెమెరాలు సంబంధించిన డీవీర్ యొక్క వైర్లు కత్తిరించబడి ఉండి డీవీర్ కనిపించలేదు. తర్వాత బ్యాంకులో బాత్రూం పక్కన ఉన్న కిటికీ అద్దాలు పగలగొట్టి కిటికీ కి ఉన్నటువంటి ఐరన్ గ్రిల్స్ ఊడిపోయి ఉండెను.

బ్యాంకు యొక్క స్ట్రాంగ్ రూముని తెరిచి చూడగా స్ట్రాంగ్ రూంలో ఉన్నటువంటి నగదు గాని, బంగారు ఆభరణాలు గాని, డాక్యుమెంట్స్ గాని పోలేదు. ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు రాత్రి సమయంలో బ్యాంకు యొక్క కిటికీ అద్దాలు, గ్రిల్స్ పగలగొట్టి బ్యాంకు లోనికి ప్రవేశించి స్ట్రాంగ్ రూము యొక్క హ్యాండిల్ విరగొట్టి దొంగతనం చేయడానికి ప్రయత్నం చేసినారు. సీసీ కెమెరాల యొక్క డీవీర్ ను ఎత్తుకెళ్లడం జరిగింది. అట్టి డీవీర్ విలువ అందాజ్ 8000/- ఉంటుంది.నేరం చేసిన తీరు నిందితురాలు 1. పసుల అంకిత బి .టెక్ చదువుకున్నది. పెళ్ళికి ముందు అనగా 2019 వ సంవత్సరం లో, తనకు సౌత్ సెంట్రల్ రైల్వే డిపార్ట్మెంట్ నందు టికెట్ కౌంటర్ మేనేజర్ జాబ్ ఇప్పిస్తానని చెప్పి ఒక వ్యక్తి సాయి నివాస్ మోసం చేసి 5 లక్షలు తీసుకున్నాడు కానీ ఎటువంటి జాబ్ ఇవ్వలేదు, మోసపోయానని గ్రహించి జాబ్ చేసుకుంటూ ఉండేది. ఆ తర్వాత తనకు తన జీతం డబ్బులు జల్సాలకు సరిపోవడం లేదు అని ఎలాగైనా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో తాను ఎలాగ మోసపోయిందో అలాగే, సౌత్ సెంట్రల్ రైల్వే డిపార్ట్మెంట్ నందు టికెట్ కౌంటర్ మేనేజర్ జాబ్ ఇప్పిస్తానని చెప్పి గద్వాల చెందిన ముగ్గురు వ్యక్తుల నుండి 18 లక్షల రూపాయలు ఒక్కరి నుండి 6 లక్షలు తీసుకొని అట్టి డబ్బుల ను ఆమె జల్సాలకు ఉపయోగించి గోవా, బెంగళూరు టూర్ తిరుగు కుంటూ ఖర్చు చేసింది. ఆ తర్వాత 2022 లో 2.రాచాల జగదీశ్వర్ రెడ్డి ని వివాహం చేసుకున్నది. అయితే తన భర్త కు కొత్తగా ఇంటి నిర్మాణం కు మరియు పెళ్లి కి అప్పులు అయినవి. గత నవంబర్- 2024 నెలలో, గతంలో మోసం చేసిన ముగ్గురు వ్యక్తులు గద్వాల టౌన్ మరియు అయిజా పోలీస్ స్టేషన్ లలో, పసుల అంకిత జాబ్ ఇప్పిస్తానని మోసం చేసింది అని కేసు పెట్టగా, అది తెలసి పసుల అంకిత, తన భర్త 2.రాచాల జగదీశ్వర్ రెడ్డి దగ్గరికి వచ్చి నేను తప్పు చేశాను, ఎలాగైనా అట్టి డబ్బులు చెల్లించమని తన భర్త ని కోరగా, అందుకు తన భర్త ఒప్పుకుని వారికి డబ్బులు తిరిగి ఇస్తానని మాట్లాడుకున్నారు. ఆ తరువాత వారికి డబ్బులు ఎలాగా తిరిగి ఇవ్వలి మరియు తన యొక్క అప్పులు ఎలా తీర్చాలి అని ఆలోచించి, వారికి డబ్బులు తిరిగి ఇవ్వాలంటే ఏదైనా దొంగతనం చేయాలని నిర్ణయించుకుని, బ్యాంక్ లో అయితే అదికంగా డబ్బులు ఉంటాయి అని అనుకోని 1. పసుల అంకిత మరియు తన భర్త 2. జగదీశ్వర్ రెడ్డి లు కలసి 3. రాచాల బాస్కర్ రెడ్డి, 4. మంద నాగరాజు మరియు 5. గణేష్ లకు కూడా డబ్బు ఆశ చూపించి వారిని ఒప్పించి, వారు ముందే వేసుకున్న పథకం ప్రకారం, 1. పసుల అంకిత యొక్క క్రెట కార్ నం టీఎస్ 33హెచ్2847 కారులో గద్వాల, నారాయణపేట, మరికల్, ప్రాంతాలలో ఉన్న బ్యాంకులలో దొంగతనం చేయడానికి వెళ్లి అక్కడ వీలుపడనందున, తేది: 27.12.2024 రోజు రాత్రి సమయంలో అమరచింత మండలంలో ఉన్న యూనియన్ బ్యాంకు లో దొంగతనం చేయాలని బ్యాంకు వెనకవైపు ఉన్న కిటికీ గ్రిల్స్ ఊడగొట్టి బ్యాంకు లోనికి ప్రవేశించి బ్యాంకు లాఖరుకు ఉన్న స్ట్రాంగ్ రూము డోర్ ను వారు ముందుగా తెచ్చుకున్న గడ్డపార, మంకీ స్పానర్, ఐరన్ పైప్ లతో పగలగొట్టడానికి ప్రయత్నం చేయగా అది తెరుచుకోలేదు. వారి ప్రయత్నం విఫలం అయినందున, సీసీ కెమెరాల ద్వారా వాళ్లు దొరికిపోతామని అనుకొని సీసీ కెమెరాలకు ఉన్న డీవీర్ ను వాళ్లు ఎత్తుకెళ్లినారు. బ్యాంకు లో ఉన్నటువంటి బంగారం, నగదు, ఎటువంటి డాక్యుమెంట్స్ మరియు వస్తువులు పోలేదు.నేరస్తులను పట్టుకున్న విధానం నేరస్తుల ను పట్టుకోవడానికి శ్రీ. రావుల గిరిధర్, ఐపీస్ , వనపర్తి మరియు డిఎస్పి వెంకటేశ్వర్ రావు పర్యవేక్షణలో, ఆత్మకూరు సీఐ శివకుమార్ మరియు, అమరచింత ఎస్సై సురేష్, సిసిఎస్ సిబ్బంది అధ్వర్యంలో ప్రత్యేక టీం లను ఏర్పాటు చేసి, సాకేంతిక పరిజ్ఞానం ఉపయోగించి తేది. 05.01.2025 నాడు మద్యాహ్నం అందాజ 02:00 గంటల సమయలంలో భగత్ సింగ్ విగ్రహం వద్ద, మెయిన్ రోడ్డు, అమరచింత పట్టణం నందు వెహికిల్ చెకింగ్ చేస్తుండగా నేరస్తులు ఐదుగురు క్రెట కార్ కారులో వెళ్తున్న వారిని అనుమానంతో వారిని ఆపడానికి ప్రయత్నించగా వారు పోలిస్ వారిని చూసి పారిపోవడానికి ప్రయత్నించగా వారిని పట్టుకొని వచ్చి అనుమానం తో ప్రశ్నించగా అట్టి వారు ఇట్టి చేసిన నేరమును ఒప్పుకున్నారు.విచారణలో భాగంగా నిందితుల నుండి స్వాధీన పరచుకున్న సీసీ కెమెరాలకు ఉన్న డీవీర్, ఇతర వస్తువుల వివరములు ఈ క్రింది విధంగా కలవు. 01. డీవీర్ (డిజిటల్ వీడియో రికార్డర్ ) ఆర్ఎస్ . 8000/-,01.హుండై క్రెట కార్ నెంబర్ టీఎస్ 33హెచ్ 2847 కారు, డివిర్ వస్తువులను పోలీసులు స్వార్ధీన పరుచుకున్నారు.ఈ కేసును ఛేదించడంలో ప్రతిభ కనబర్చిన ఆత్మకూర్ సిఐ, శివకుమార్, అమరచింత ఎస్సై,సురేష్ , ఐటీ కోర్ కానిస్టేబుల్, మురళి, అమరచింత కానిస్టేబుళ్లు., పర్వతాలు, అరవింద్, పురుషోత్తం, పోలీసు సిబ్బందిని క్యాష్ రివార్డ్ తో ఎస్పీ ప్రత్యేకంగా అబినధించారు.ఈ కార్యక్రమంలో ఏ ఆర్ అదనపు ఎస్పీ, వీరా రెడ్డి, వనపర్తి డిఎస్పీ, వెంకటేశ్వరా రావ్, డిసిఆర్బి డిఎస్పీ, ఉమా మహేశ్వర రావ్ సైబర్ క్రైం డి ఎస్పీ,రత్నం,స్పెషల్ బ్రాంచ్ సీఐ, నరేష్, వనపర్తి సీఐ, క్రిష్ణ, ఆత్మకూరు సీఐ, శివకుమార్, కొత్తకోట సీఐ, రాంబాబు,పోలీసులు, క్రీడాకారులు, తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News