Friday, March 13, 2026

18న జరిగే తెలంగాణ రాష్ట్ర బంద్ కు మద్దతు

నేటి సాక్షి పాలేరు , అక్టోబర్ 16:బిసి రిజర్వేషన్ల సాధనకు వివిధ బిసి సంఘాలతో ఏర్పడిన ‘బిసి ఐక్య కార్యాచరణ కమిటీ’- (బిసి జెఎసి) ‘బంద్ ఫర్ జస్టిస్’ 18న తలపెట్టిన రాష్ట్ర బంద్ కు కూసుమంచి మండల కేంద్రంలో సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు వామపక్ష పార్టీల నాయకులు మల్లేష్ , ఐ వెంకన్న, చాపల సత్యనారాయణలు తెలిపారు.గురువారం కూసుమంచి మండల కేంద్రంలో జరిగిన వామపక్ష పార్టీల సమావేశంలో వారు మాట్లాడుతూ.. బిసి రిజర్వేషన్ల సాధనకు తెలంగాణ ఉద్యమ తరహాలోనే ఒక సామాజిక ఉద్యమంగా ముందుకు సాగాలని సూచించారు. బిసి బిల్లులను ఆమోదించి, రిజర్వేషన్లను అమలు చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపైన ఉందని స్పష్టం చేశారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలు జీవోతో పాటు, స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ మీద ఇటీవల హైకోర్టు స్టే విధించడంతో, రిజర్వేషన్ల అమలు, స్థానిక సంస్థల ఎన్నికలు నిలిచిపోయాయి. దీనికి ప్రధాన కారణం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వమే. ఇప్పటికైనా రాష్ట్రం నుండి ప్రాతినిథ్యం వహిస్తున్న బీజేపీ ఎంపీలు, కేంద్ర మంత్రులు నైతిక బాధ్యత వహించి, వారి పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కులగణన సర్వే నిర్వహించి, బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల బిల్లు కేంద్రానికి పంపించినా స్పందించలేదన్నారు. శాసనసభలో అన్ని పార్టీలు ఏకగ్రీవంగా ఆమోదించి ఆర్డినెన్స్ చేసి గవర్నర్ పంపించినా ఆమోదించకపోవడం వల్లే ఆగిపోయాయన్నారు. రిజర్వేషన్లు బీజేపీ కులతత్వ, మనువాద పార్టీ అయినందున, కుల వ్యవస్థ, అసమానతలు ఉండాలని, మనుధర్మ శాస్త్రాన్ని అమలు చేయాలని కోరుకుంటుందని ఆరోపించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, మహిళలకు రావాల్సిన హక్కులన్నింటినీ కాలరాస్తున్నదని ధ్వజమెత్తారు. బీసీల పట్ల బీజేపీకి చిత్తశుద్ది ఉంటే 9 షెడ్యూలులో చేర్చేందుకు అవసరమైతే రాజ్యాంగ సవరణ ద్వారా కేంద్ర ప్రభుత్వం తక్షణమే పార్లమెంటును సమావేశపరిచి, ఆ ప్రక్రియను పూర్తి చేయాలన్నారు. రిజర్వేషన్లు 50 శాతం పరిమితి పేరుతో ఏళ్ళ తరబడి బిసిల రిజర్వేషన్ పెంపు అంశాన్ని నాన్చడం ఏ మాత్రం తగదన్నారు. ఆర్ధికంగా వెనుకబడిన వర్గాల (ఈడబ్ల్యూఎస్) రిజర్వేషన్ వర్తింపులో ఈ పరిమితిని ఇప్పటికే దాటి పోయిన విషయాన్ని పరిగణలోకి తీసుకోవాలన్నారు. గవర్నర్ వద్ద పెండింగ్ ఉన్న బిల్లులు నిర్ణీత కాలపరమితిలోగా ఆమోదం లభించకపోతే, నోటిఫై చేయవచ్చని తమిళనాడు కేసులో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును పరిశీలించాలన్నారు. రాష్ట్రం నుండి ప్రాతినిథ్యం వహిస్తున్న బీజేపీ ఎంపీలు, మంత్రులు కేంద్రంపై ఒత్తిడి తేవడానికి ఎటువంటి ప్రయత్నమూ చేయలేదన్నారు. కేంద్రంలో అధికారంలో బీజేపీ ఉండడం వల్లనే ఈ రోజు ఈ రిజర్వేషన్లు అమలు కాని పరిస్థితి ఏర్పడిందని, బీసీలకు 42శాతం రిజర్వేషన్లు అమలు కావాలంటే రాష్ట్రంలో, బిజెపి మోడీ ని ఒప్పించి పార్లమెంటు లో బిల్లు పెట్టి అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో టీయూసీఐ నాయకులు నామాల ఆజాద్, సీపీఐ నాయకులు మట్టే లింగయ్య తదుతరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News