- ప్రతిభ కనబరిచిన 22 మంది విద్యార్థులకు అవార్డుల పంపిణీ
- గురువులను గౌరవించడం విద్యార్థినీ విద్యార్థుల బాధ్యత
- చదువు వల్లనే ఉన్నత స్థాయికి ఎదుగుతారు
- రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి

నేటి సాక్షి ప్రతినిధి వనపర్తి : రామన్ ఎడ్యుకేషనల్ సొసైటీ ఐఐటి టాలెంట్ టెస్ట్ గణిత శాస్త్రవేత్త రామానుజన్ జయంతి డిసెంబర్ 22న ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా నిర్వహించడం జరిగింది.ఐఐటి టెస్టులో ప్రతిభ కనబరిచిన 22 మందివిద్యార్థులకు ఆదివారం ఎంఎన్ఆర్ మినీ ఫంక్షన్ హాల్లో శంకర్ గౌడ్, రాములు అధ్యక్షతన అవార్డుల ప్రాధానానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి పాల్గొన్నారు.చిన్నారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నీళ్లు, నిధులు, నియామకాలు అంశాల మీద ఏర్పడడం జరిగింది. కానీ గత ప్రభుత్వం ఈ మూడింటిని విస్మరించి పరిపాలన చేసిందన్నారు.ఇప్పటి ప్రజా ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి విద్యపై ఎక్కువ ఫోకస్ పెట్టారని దానికి ఉదాహరణనే ప్రభుత్వ హాస్టల్లో చదువుకునే విద్యార్థులకు కాస్మోటిక్. మెస్ చార్జీలను పెంచి విద్యార్థులకు అండగా ఉన్నారని అన్నారు. ప్రజా ప్రభుత్వంలో మాజీ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి విద్యా కమిషనర్ గా నియమించి విద్యలో అనేక కొత్త అంశాలను చేరుస్తూ విద్యాభివృద్ధికి కృషి చేస్తున్నారు.ఈ మధ్యకాలంలో ఆకునూరి మురళి విద్యాభివృద్ధి అంశంపై హైదరాబాదులో ఓ మీటింగ్ ఏర్పాటు చేశారు ప్రసంగించే సమయంలో దేశంలో విద్య అభివృద్ధి చెందాలంటే దేశ జిడిపిలో 12,% విద్యపై ఖర్చుపెడితే ఉన్నతమైన విద్యను ప్రతి ఒక్కరికి అందించవచ్చని కావున రాష్ట్ర ముఖ్యమంత్రి త్వరలో ఆదిశగా అడుగులు వేసే విధంగా సిద్ధంగా ఉన్నారని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఈ మధ్య నిర్వహించిన ఒక సర్వేలో 69 లక్షల మంది విద్యార్థులు చదువుకుంటే ప్రవేట్ పాఠశాలలో34 లక్షల మంది విద్యార్థులు 13 వేల పాఠశాలలో చదువు కుంటున్నారని, ప్రభుత్వ పాఠశాలలో 24 లక్షల మంది విద్యార్థులు 30 వేల పాఠశాలలను చదువుకుంటున్నారని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం త్వరలో ఎల్కెజి, యూకేజీ విద్యను కూడా ఇంగ్లీష్ మీడియం లో ప్రభుత్వ పాఠశాలలో చేర్చే విధంగా అడుగులు వేస్తుందని అన్నారు. విద్యార్థులు ఫోన్ తక్కువ వాడుకొని పుస్తకాలను ఎక్కువగా చదువుకోవాలని సూచించారు. చదువు మంచిగా చదువుకోవడం వల్లనే ఉన్నత స్థానాలకు ఎదుగుతారని కాబట్టి చదువును ఇష్టపడి చదవాలని విద్యార్థులకు సూచించారు. గణిత ఉపాధ్యాయుడు రాములు కొన్ని సంవత్సరాల నుంచి విద్యకు సంబంధించిన మంచి కార్యక్రమాలు నిర్వహిస్తు న్నారని అందులో భాగమే రామున్ ఐఐటి టాలెంట్ టెస్ట్ నిర్వహించినందుకు అతనికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపి శాలువాతో సన్మానించడం జరిగింది.కార్యక్రమంలో మొదటి బహుమతి గౌతమ్ ను శాలువాతో సన్మానించడం జరిగింది. రెండో బహుమతి శ్రీ చందన కూడా శాలువాతో సన్మానించడం జరిగింది. విద్యవేత్తలు వనపర్తి నియోజకవర్గం లో ఒక ఐఐటి ప్రభుత్వ కోచింగ్ సెంటర్ ని ఏర్పాటు చేయాలని కోరారు. దానికి స్పందించిన చిన్నారెడ్డి త్వరలో చిట్యాల రెసిడెన్షియల్ స్కూల్లో ప్రభుత్వ ఐఐటి కోచింగ్ సెంటర్ ఏర్పాటు చేసే విధంగా కృషి చేస్తానని మాట ఇవ్వడం జరిగింది. కార్యక్రమంలో జిల్లా మత్స్యశాఖ సెల్ అధ్యక్షుడు నందిమల్ల యాదయ్య, రాష్ట్రమైనార్టీ కార్యదర్శి కమ్మర్ మియా, కిసాన్ సెల్ అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి, కొత్తకోట కృష్ణారెడ్డి, వనపర్తి మండల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నారాయణ, మైనార్టీ సెల్ అధ్యక్షుడు సమ్మర్, యూత్ కాంగ్రెస్ నాయకులు లాయర్ బాబా, జిల్లా సేవాదళ్ అధ్యక్షుడు జానకిరాములు, కౌన్సిలర్ పరశురాములు, వనపర్తి మండల్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఆవుల చంద్రశేఖర్, వనపర్తి మండల్ ఎన్ ఎస్ యు ఐ అధ్యక్షుడు చరణ్, ఏఐపిసి వనపర్తి జిల్లా ఉపాధ్యక్షులు నాగార్జున,సీనియర్ నాయకులు రాగి వేణు, కోళ్ల వెంకటేష్, శరత్, వెంకటేష్, అబ్దుల్లా, శరత్, పెద్దమందడి మండల్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ గట్టు రాజు కాంగ్రెస్ పార్టీ నాయకులు, విద్యార్థుల తల్లిదండ్రులు, తదితరులు పాల్గొన్నారు.

