(నేటి సాక్షి)డిసెంబర్ 14(…):పేదల ఆరోగ్యం కోసం ఉచిత వైద్య శిభీరాలు ఏర్పాటు చేసి పలు ఆరోగ్య పరీక్షలు నిర్వహించి మందులు అందించడమే చైతన్య రూరల్ డెవలప్మెంట్ సోషల్ సర్వీస్ సొసైటీ లక్ష్యమని అంతర్జాతీయ మోటివేషనల్ స్పీకర్ శ్యామ్ గుంటి అన్నారు.గత నెల 28 వ తేదీన సర్కిల్ పరిధిలోని ఎర్రబోడ గ్రామంలో చైతన్య రూరల్ డెవలప్మెంట్ సోషల్ సర్వీస్ సొసైటీ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి పలురకాల వైద్య పరీక్షల తో పాటు కంటి పరీక్షలు చేపట్టారు.ఈ కార్యక్రమాన్ని తెలంగాణ స్టేట్ క్రిస్టియన్ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ దీపక్ జాన్ ప్రారంభించారు.గత నెలలు కంటి పరీక్షలు చేయించుకున్న 200 మందికి వారికిఆదివారం 14 వ తేదీన ఉచిత కంటి అద్దాలను శ్యామ్ గుంటి,ముఖ్య ఆహ్వానితులుగా హాజరై పంపిణీ చేశారు. అనంతరం శ్యామ్ గుంటి మాట్లాడుతూ. ప్రజలు తమ ఆరోగ్యం పై శ్రద్ధ వహించాలని ఆరోగ్యం పై నిర్లక్ష్యం వహించకుండా జాగ్రత్త పడాలన్నారు. ఉచితంగా కంటి అద్దాలు అందుకున్న వారు హర్షం వ్యక్తం చేస్తూ నిర్వాహకులను అభినందించారు. ఈ కార్యక్రమంలో గుంటిశ్యామ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రగడంపల్లి శ్రవణ్, భరత్ రెడ్డి, మహేందర్,ఆ సంస్థ నిర్వాహకులు, తదితరులు పాల్గొన్నారు.





