కమిషనర్ ఎన్.మౌర్య
నేటి సాక్షి తిరుపతి జిల్లా (బాదూరు బాల)
నగరపాలక సంస్థ పరిధిలోని మాస్టర్ ప్లాన్ రోడ్లలో స్థలాలు కోల్పోయిన 207 మందికి టిడిఆర్ బాండ్లను పంపిణీ చేశామని కమిషనర్ ఎన్.మౌర్య తెలిపారు. మాస్టర్ ప్లాన్ రోడ్లలో స్థలాలు కోల్పోయిన లబ్ధిదారులకు మంగళవారం నగరపాలక సంస్థ కార్యాలయంలో కమిషనర్ టిడిఆర్ బాండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలో మాస్టర్ ప్లాన్ రోడ్లు ఏర్పాటులో స్థలాలు కోల్పోయిన వారికి పారదర్శకంగా బాండ్లు పంపిణీ చేసేందుకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించామని అన్నారు. ఇందులో అందరి దరఖాస్తులు పరిశీలించి ఆన్లైన్ చేశామని అన్నారు. పలు మార్లు టిడిఆర్ కమిటీ సభ్యులు ఆన్లైన్ ద్వారా సమావేశమై అన్ని పత్రాలు సక్రమంగా ఉన్న వారిని గుర్తించామని అన్నారు. ఈ ప్రక్రియలో ఇప్పటి వరకు 207 మందికి టిడిఆర్ బాండ్లు పంపిణీ చేశామని అన్నారు. కాగా మంగళవారం ఆన్లైన్ ద్వారా నిర్వహించిన కమిటీ సమావేశంతో పాటు 187 మందిని ఎంపిక చేశామని అన్నారు. వీరందరూ గిఫ్ట్ డీడ్ ఇచ్చిన వెంటనే టిడిఆర్ బాండ్లు మంజూరు చేస్తామని అన్నారు. ఈ సమావేశంలో డిసిపి మహాపాత్ర, ఏసిపి లు బాలాజి, మూర్తి, ప్లానింగ్ సెక్రటరీ లు పాల్గొన్నారు.