బేగంపేట జిల్లా పరిషత్ పాఠశాల పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
నేటి సాక్షి,బెజ్జంకి: బెజ్జంకి మండలం బేగంపేట గ్రామంలో ఉన్న జిల్లా పరిషత్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల మరొక అపూర్వ సందర్భానికి వేదికైంది. 2002–2003 విద్యా సంవత్సరంలో పదవ తరగతి పూర్తి చేసిన పూర్వ విద్యార్థులు 22 ఏళ్ల తర్వాత ఒకే వేదికపై ఆత్మీయంగా కలుసుకొని ఆదివారం సమ్మేళనం ఘనంగా నిర్వహించారు.విద్యార్థులు ఒకరిని ఒకరు ఆత్మీయంగా పలకరిస్తూ, ఆ కాలంలో గడిపిన మధురమైన స్మృతులను నెమరు వేసుకున్నారు. విద్యార్థుల ప్రస్తుత జీవితాలలో చోటు చేసుకున్న విజయాల్లో తమ గురువుల పాత్రను గుర్తుచేసుకుంటూ, ఉపాధ్యాయులైన రమేష్, జోహర్ రెడ్డి, రామస్వామి, స్వామి లను శాలువాలతో సత్కరించి జ్ఞాపికలు అందించారు.
అందులో భాగంగా నృత్యాలు, ఆటపాటలతో సందడి చేశారు. మిత్రులు సెల్ఫీలు దిగుతూ, సహపంక్తి భోజనం చేస్తూ గడిచిన కాలాన్ని గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఏల శేఖర్ బాబు, వెంకట్ రెడ్డి, శేఖర్, రాజు రెడ్డి, జనగాం శ్రీనివాస్, బుర్ర ప్రవీణ్, దుర్గయ్య, సంతోష్, రఫీ, ప్రవీణ్, రమేష్, ప్రతాప్, రాజ్ కుమార్, భూపేందర్, సతీష్, రాజు. కిషన్, నరేష్, లత, రమ, పర్వీన్ బేగం, వసంత, స్వప్న, సునీత, మహేశ్వరి, స్మిత, మంజుల, రేవతి, పుష్పలత, అనిత తదితరులు పాల్గొన్నారు.

