Wednesday, March 11, 2026

22 ఫీట్లకు చేరిన కోయిల్ సాగర్ ప్రాజెక్టు నీటిమట్టం..

-జలకళ సంతరించుకుంటున్న ప్రాజెక్టు..

నేటి సాక్షి, దేవరకద్ర, జులై 6

మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గ పరిధిలోని దేవరకద్ర మండలం కోయిల్ సాగర్ భారీ నీటిపారుదల ప్రాజెక్టులో ఆదివారం నీటిమట్టం 22 ఫీట్లకు చేరింది. గత కొన్ని రోజులుగా జూరాల నుండి కృష్ణా జలాలను కోయిల్ సాగర్ కు తరలిస్తుండడంతో ప్రాజెక్టులో నీటిమట్టం క్రమేపి పెరుగుతుంది. ప్రాజెక్టు పూర్తి నీటి నిల్వ స్థోమత 32.5 ఫీట్లు. ప్రాజెక్టులోకి కృష్ణా జలాలు తరలిస్తుండటంతతో కోయిల్ సాగర్ కు జలకళ వచ్చింది. దీంతో వివిధ ప్రాంతాల నుండి పర్యాటకులు కోయిల్ సాగర్ ను చూడడానికి ప్రాజెక్టు వద్దకు తరలివస్తున్నారు. దీంతో ప్రాజెక్టు నీటితో కలకళలాడుతుంది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News