నేటి సాక్షి పాలేరు , నవంబర్ 1 :రోడ్ ప్రమాదంలో చనిపోయిన వ్యక్తి కుటుంబానికి నష్టపరిహారం చెల్లించాలని కార్మిక సహాయ కమీషనర్ ఖమ్మం కోర్ట్ శనివారం తీర్పు వెల్లడించింది .. దీంతో ఎన్నో ఏళ్ల తర్వాత బాధిత కుటుంబానికి న్యాయం జరిగింది.. వివరాలు ఇలా ఉన్నాయి.. నేలకొండపల్లి మండలం కోరుట్లగూడెం గ్రామానికి చెందిన కొత్తపల్లి వెంకటేశ్వరరావు 27 సెప్టెంబర్ 1998న ఖమ్మం వెళ్ళి వస్తుండగా ట్రాక్టర్ ప్రమాదంలో మరణించాడు .. ప్రమాద ఘటనపై మృతిని కుటుంబం న్యాయం చేయాలని కోరుతూ కోర్టు తలుపులు తట్టింది.. ఏళ్ళు గడిచిన న్యాయ జరగకపోవడంతో నిరాశతో కేసును అర్థంతరంగా ఆపారు.. విషయం తెలుసుకున్న పాలేరు సేవాదళ్ కన్వీనర్ బచ్చలకూరి నాగరాజు మరో లాయర్ ఆకుల శేఖర్ ను ఏర్పాటు చేసి బాధిత కుటుంబం కోసం కోర్టులో పోరాటం సాగించగా ఎట్టకేలకు 27 ఏళ్ల తరువాత శనివారం మృతుని కుటుంబానికి న్యాయం జరిగింది. కార్మిక సహాయ కమీషనర్ ఖమ్మం కోర్ట్ మృతుని కుటుంబానికి నష్ట పరిహారం చెల్లించాలని తీర్పు ఇచ్చింది. కొత్తపల్లి వెంకటేశ్వరరావు భార్య నాగమణి, తల్లి భద్రమ్మ కు 2,81,321 (రెండు లక్షల ఎనభై ఒక వేల మూడు వందల ఇరవై ఒక రూపాయలు) రూపాయల నష్టపరిహారంను కార్మిక అధికారి ఏసీ కృష్ణవేణి అందించారు. దీంతో బాధితులకు అనుకూలంగా తీర్పు రావడంతో కేసును ముందుకు తీసుకుపోయి తమ కుటుంబాలకు న్యాయం జరిగేలా చేసిన బచ్చలకూరి నాగరాజుకి మృతుని కుటుంబం కృతజ్ఞతలు తెలిపారు . నాయకుడు అంటే బచ్చలకూరి నాగరాజు లా ఉండాలని పలువురు ఆయనను అభినందిస్తున్నారు.. కొరట్లగూడెం కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ కొత్తపల్లి సుబ్బారావు, కోరట్లగూడెం మాజీ సర్పంచ్ షేక్ జహీరాభి, బచ్చలకూరి ఉదయ్ ప్రతాప్, కొత్తపల్లి సాయి ఉన్నారు.

