పూర్వ విద్యార్థుల ఆపూర్వ సమ్మేళనం
నేటిసాక్షి, రాయికల్ :
వారంతా 28ఏళ్ల క్రితం రాయికల్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి చదివిన పూర్వ విద్యార్థులు. 1996,1997 ఏటా ఎస్సేస్సీ పూర్తయి ఉన్నత చదువులకు తలో దారి పట్టిన పూర్వ విద్యార్థులంతా ఆదివారం రాయికల్ మండలం మూటపెల్లి గ్రామంలో ఒకే వేదికను పంచుకొని పాత జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. ఈ వేదికను పంచుకునేందుకు చాలమంది మిత్రులు దుబాయి, ముంబై, హైదరాబాద్ తదితర ప్రాంతాల నుండి వచ్చి పాఠశాల స్థాయిలో చేసిన అల్లరిని గుర్తు చేసుకున్నారు. రోజంతా ఆనందంగా… ఉత్సాహంగా గడిపారు. తమకు విద్యా బుద్దులు నేర్పిన గురువులను స్మరించుకొని పాఠశాల అభివృద్దిలో భౄగస్వామ్యులు కావాలని తీర్మానించుకున్నారు.
ఫోటో రైటప్: 13RKL01: పూర్వ విద్యార్థులంతా ఒకే చోట చేరిన దృశ్యం