నేటి సాక్షి ప్రతినిధి/ శంకర్పల్లి: న్యూస్ 280 ఓట్ల భారీ మెజార్టీతో మహాలింగాపురం సర్పంచ్ గా బిఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి మాచన్నగారి రాఘవేందర్ రెడ్డి ముగ్గురిని ఓడించి విజయం సాధించారు. ఈ సందర్భంగా రాఘవేందర్ రెడ్డి మాట్లాడుతూ తనపై నమ్మకంతో గ్రామ సర్పంచ్ గా ఎన్నుకున్న ప్రజలందరికీ జీవితాంతం రుణపడి ఉంటానని తెలిపారు. ప్రజల ఆశీర్వాదంతోనే సర్పంచ్ గా గెలిచానని ధీమా వ్యక్తం చేశారు. గ్రామాన్ని గుండెల్లో పెట్టుకొని పరిపాలిస్తానని పేర్కొన్నారు. తన విజయానికి కృషి చేసిన మాజీ ఎంపీటీసీ భవాని యాదగిరి, మాజీ ఎంపీపీ గోవర్ధన్ రెడ్డి, సీనియర్ నాయకులకు పేరుపేరునా కృతజ్ఞతలు తెలియజేశారు. గ్రామంలో ఉన్న ప్రతి సమస్యను సీనియర్ నాయకుల, గ్రామస్తుల సమక్షంలో పరిష్కారిస్తానని హామీ ఇచ్చారు.





