నేటి సాక్షి, దుబ్బాక: దుబ్బాకలోని కోమటిరెడ్డి రజనీకాంత్ రెడ్డి ఫంక్షన్ హాల్లో ఈ నెల 3న ప్రజాప్రతినిధుల ఆత్మీయ సన్మాన సభ నిర్వహిస్తున్నట్టు స్థానిక ఎమ్మెల్యే కొత్తప్రభాకర్‌రెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి ప్రారంభం కానున్న ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు హాజరవుతారని చెప్పారు. ఐదేండ్లు ప్రజాప్రతినిధులుగా ప్రజల కోసం పనిచేసి, పదవీకాలం పూర్తి చేసుకున్న స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు, తాజా మాజీ నామినేటెడ్ ప్రతినిధుల సేవలకు గుర్తింపుగా ఆత్మీయ సన్మానం ఏర్పాటు చేసినట్టు చెప్పారు.
దుబ్బాక నియోజకవర్గంలోని జడ్పీటీసీలు, ఎంపీపీలు, వైస్ ఎంపీపీలు, కో–ఆప్షన్ సభ్యులు, తాజా మాజీ సర్పంచులు, తాజా నామినేటెడ్ చైర్మన్, వైస్ చైర్మన్లు హాజరై, ఆత్మీయ సన్మాన కార్యక్రమంలో పాల్గొనాలని కోరారు. అలాగే, దుబ్బాక మున్సిపల్ చైర్మన్, పాలక వర్గం, పట్టణ, మండల, గ్రామ, బూత్, యూత్, విద్యార్థి, సోషల్ మీడియా ప్రతినిధులు, సొసైటీ చైర్మన్, పాలక వర్గ సభ్యులు, మాజీ ప్రజా ప్రతినిధులు, సీనియర్లు నాయకులు, బీఆర్ఎస్ శ్రేణులు హాజరై కార్యక్రమం విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.