Saturday, March 21, 2026

*300 ఈత చెట్ల నరికివేతతో బొమ్మెనలో ఉద్రిక్తత*——-* జీవనోపాధి కోల్పోయిన గీతా కార్మిక కుటుంబాలు… బాధితులకు న్యాయం చేయాలంటూ డిమాండ్—-*

నేటి సాక్షి – కథలాపూర్ (రాధారపు నర్సయ్య)*కథలాపూర్ మండలం బొమ్మెన గ్రామంలో గీతాకార్మిక కుటుంబానికి జీవనాధారమైన ఈత చెట్లను భారీగా నరికివేయడం తీవ్ర ఆందోళనకు దారితీసింది. సుమారు 300 ఈత చెట్లు ఒకేసారి నరికివేయబడిన ఘటన గ్రామంలో ఉద్రిక్తతను రేకెత్తించింది. ఈ చెట్లపై ఆధారపడి జీవిస్తున్న గౌడ్ కుటుంబాలు ఒక్కసారిగా ఉపాధి కోల్పోయి తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి.*ముందస్తు హెచ్చరికలైనా ఫలితం లేకుండా…*గత సంవత్సరం కూడా ఇలాంటి ఘటన చోటుచేసుకున్న సమయంలో పోలీసులు గ్రామంలో సామరస్యాన్ని కాపాడాలని, గీతాకార్మిక వృత్తిలో జోక్యం చేసుకోవద్దని హెచ్చరించినట్లు స్థానికులు గుర్తుచేస్తున్నారు. అయితే ఈసారి ఆ హెచ్చరికలను పట్టించుకోకుండా మరింత పెద్ద ఎత్తున చెట్లను నరికివేయడం జరిగిందని బాధితులు ఆరోపిస్తున్నారు. తమ మంచితనాన్ని బలహీనతగా తీసుకుని ఈ దాడికి పాల్పడ్డారని గౌడ్ సంఘం ప్రతినిధులు అంటున్నారు.*పోలీసులకు ఫిర్యాదు – చర్యలపై ఆశలు*ఘటనపై గీతా కార్మిక సంఘ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పాటు, సంఘటనా స్థలాన్ని చూపించినట్లు తెలిపారు. చెట్లను నరికివేసిన వారిపై ఎక్సైజ్ శాఖ..పోలీస్ శాఖలు కలిసి కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. బాధ్యులపై నాన్-బెయిలబుల్ కేసులు నమోదు చేసి అరెస్ట్ చేయాలని కోరుతున్నారు.*కుల వృత్తుల రక్షణపై ఆవశ్యకత*ఈ ఘటన కేవలం ఆస్తి నష్టం మాత్రమే కాకుండా, సంప్రదాయ కుల వృత్తిపై జరిగిన దాడిగా భావిస్తున్న గీతా కార్మిక సమాజం, తమ జీవనోపాధిని కాపాడాలని ప్రభుత్వాన్ని వేడుకుంటోంది. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతోంది.*ఐక్యతకు పిలుపు*ఈ సందర్భంగా గీతా కార్మిక సంఘ నాయకుడు యాగండ్ల రమేష్ గౌడ్ ‘గౌడ్ సమాజం’ ఐక్యంగా ఉండాలని పిలుపునిచ్చారు. తమ వృత్తిని, హక్కులను రక్షించుకోవడానికి సమిష్టిగా ముందుకు రావాలని ఆయన పేర్కొన్నారు.______

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News