అధ్వాన రోడ్లు.. అవస్థల ప్రయాణం..* గ్రామస్థులు, ప్రయాణికులు అవస్థలునంద్యాల నవంబర్ 01నేటి సాక్షి :నంద్యాల జిల్లా పాములపాడు మండలం కృష్ణారావుపేట నుంచి మిట్టకందాల గ్రామానికి 12 కిలో మీటర్లు 6 కోట్ల నిధులతో గత ప్రభుత్వంలో రోడ్డును పూర్తి చేశారు. గ్రామాలకు కొన్ని సంవత్సరాలుగా గ్రామస్తులు ప్రయాణికులు రోడ్డు కోసం ఎదురుచూపులు చూశారు. ప్రజల అవస్థలు గుర్తించిన ప్రభుత్వం కృష్ణారావు పేట నుంచి సిద్దేశ్వరం మిట్ట కందాల గ్రామం వరకు 12 కిలోమీటర్లు తారు రోడ్డు వెయ్యాలని ప్రభుత్వం నిర్ణయించింది. రహదారి వేసి మూడు సంవత్సరాలు మాత్రమే అయినప్పటికీ అడుగడుగునా గుంతలుగా మార్చారు. గ్రామానికి రోడ్డు వేయగానే గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. కానీ గ్రామస్తులు ఎదురుచూపులు చూసిన రోడ్డును గ్రామస్తుల కళ్ళముందే గుంతలు గుంతలుగా మార్చిన పి ఎస్ కె కంపెనీ వాహనాలు, నేషనల్ హైవే 340 సి రహదారి విస్తరణ కోసం రామసముద్రం గ్రామం వైపున ఉన్న గ్రావెల్ తోలడానికి ఈ రహదారిని విపరీతంగా ఉపయోగించడంతో గుంతలు గుంతలుగా ఏర్పడి ప్రయాణికులు నానా అవస్థలు పడుతున్నారు. వాటికి మరమ్మత్తులు కూడా అంతంతే, ఈ మార్గం గుండా వెళ్లి రావాలంటే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాత్రివేళల్లో గుంతలుండటంతో ఇబ్బంది పడుతూ వెళ్తున్న ద్విచక్ర వాహనదారులు తీవ్ర అవస్థలు పడుతున్నామని ,మరి కొంతమంది వాహనదారులు వెళ్లి కిందపడిపోయి గాయాలపాలవుతున్నారాని వాహనాచోదకులు వెల్లడిస్తున్నారు. రోడ్డు విస్తరణకు పనులకు పిఎస్ కే కంపెనీ భారీ వాహనాలు, టిప్పర్లలో మట్టి తరలించడంతో తారు రోడ్డు కాస్త మట్టి రోడ్డును తలపి స్తోంది పెద్ద పెద్ద గుంతలు పడి ఇబ్బందికరంగా తయారైందని, రోడ్డుకు ఇరువైపులా కలవట్లు ఉన్న దగ్గర ప్రమాదాలు ఏర్పడకుండా ఏర్పాటు చేసినటువంటి సైడు సేఫ్టీలను కూడా ధ్వంసం చేశారని గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.సిద్దేశ్వరం రహదారికి వెళ్ల డానికి ప్రధాన రహదారి కావడంతో గుంతలు పడి నరకం కనిపిస్తోం.. దని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. *రామసముద్రం* *రహదారి* : జూపాడు బంగ్లా మండలం రామసముద్రం గ్రామానికి ఉన్న బీటీ రోడ్డును గుంతలు గుంతలు గా మార్చిన కంపెనీ వాహనాలు. గత కొన్ని సంవత్సరాలుగా గ్రామానికి వెళ్లాలంటే తీవ్ర అవస్థలు పడాల్సిన పరిస్థితి ఏర్పడేది. అధికారులను గత సంవత్సరాలుగా అడుగుతూనే ఉండగా గ్రామానికి సిద్దేశ్వరం గ్రామం రహదారి వరకు బీటీ రోడ్డును ఏర్పాటు చేశారు. తార్ రోడ్డు వెయ్యనప్పటికీ బీటీ రోడ్డుతోనే కాలం గడుపుతూ వస్తున్నారు. అయితే రోడ్డు విస్తరణకు పిఎస్ కే కంపెనీ వాహనాలు మట్టి తవ్వకాల్లో బీటీ రోడ్డు పూర్తిగా ధ్వంసం చేశారు. మూల గ్రామమైన రామసముద్రం అవసరాలన్నీ నిమిత్తం, గర్భనిరోధక పరిస్థితుల్లో ఉన్న మహిళలకు తీసుకెళ్లాలంటే నరకం చూస్తున్నారు. మూల గ్రామం అవడంతో గ్రామంలో ఏదైనా అత్యవసర ప్రమాదం సంభవిస్తే హాస్పిటల్ కి వెళ్ళేందుకు నానా అవస్థలు ఎదుర్కొంటున్నారు. ఉన్న రోడ్డుతో కాలం కడుపుతుంటే వాటిని కూడా గుంతలు గుంతలుగా మార్చారు అంటూ గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు స్పందించి రోడ్డు నిర్మాణం చేయించాలని స్థానికులు కోరుతున్నారు.





