*వరద పాపం గత ప్రభుత్వానిదే…* •నిర్వహణలేకే… పంట పొలాల్లోకి వరద నీరు•వచ్చే వేసవిలో వరద కాలువలను ఆధునికరిస్తాం•రైతాంగాన్ని అన్ని విధాలు ఆదుకుంటా…•బకింగ్ హామ్ కెనాల్ గండ్లను పరిశీలించిన ఎమ్మెల్యే ఏలూరి •వరద ముంపుకు శాశ్వత పరిష్కారానికి కృషి •చిన్నగంజాం,ఇంకొల్లు,కారంచేడు మండలాల్లో ఎమ్మెల్యే ఏలూరి విస్తృత పర్యటన •డ్రోన్ తో కలుపు మందు స్ప్రే తీరును పరిశీలించిన ఎమ్మెల్యే ఏలూరినేటి సాక్షి, బాపట్ల జిల్లా (పర్చూరు)గత పాలకుల నిర్లక్ష్యమే వరద విపత్తులకు కారణమని, గత ఐదేళ్లు వరద కాలువల నిర్వహణ లేక ఎలాంటి ఆధునికరణకు నోచుకోక వరద సమయంలో కట్టలు తెగి వరద పంట పొలాలను ముంచేత్తిందని,దీంతో రైతాంగం తీవ్ర నష్టాలు చవిచూసిందని పర్చూరు నియోజకవర్గ ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు విమర్శించారు. వరద ప్రభావిత చిన్నగంజాం, ఇంకొల్లు, కారంచేడు మండలాల్లో ఆయన సోమవారం విస్తృత పర్యటన నిర్వహించి, నష్టాల వివరాలు, కాలువల పరిస్థితులను సమీక్షించారు. రైతుల శ్రేయస్సు కోసం ప్రభుత్వం కృషి చేస్తుందని రైతులను ఆదుకునే బాధ్యత తీసుకుంటామన్నారు.పంట పొలాలు వరద ముంపుకు గురికాకుండా శాశ్వత పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.*“నిర్వహణ లేకే వరద నీరు పంట పొలాల్లోకి”*బకింగ్‌హామ్ కెనాల్, వరద కాలువలు గత ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యమే ప్రదర్శించిందని ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు.వరద కాలువలకు ఎలాంటి మరమ్మతులు చేయకుండా వదిలేయడంతో ఈసారి వరద నీరు నేరుగా పంట పొలాల్లోకి ప్రవహించిందన్నారు. రైతు ఎంత కష్టపడ్డా ప్రభుత్వ వ్యవస్థ పనిచేయకపోతే ఇలాంటివే పరిస్థితులు వస్తాయని వ్యాఖ్యానించారు. కొమ్మమూరు కెనాల్ గండ్లను పరిశీలించిన ఎమ్మెల్యే ఏలూరి తక్షణమే గండ్లు పూడ్చాలని అధికారులను ఆదేశించారు.*బకింగ్ హామ్ కెనాల్ గండ్లు పరిశీలన*కారంచేడు ప్రాంతంలో బకింగ్‌హామ్ కెనాల్ (కొమ్మమూరు)లో ఏర్పడిన గండ్లను ఎమ్మెల్యే ప్రత్యక్షంగా పరిశీలించారు. ఇంజనీరింగ్ అధికారులతో మాట్లాడుతూ ఇలాంటి కీలక కాలువలు గండ్లు తక్షణమే పూడ్చాలని ఆదేశించారు.తక్షణ మరమ్మతుల కోసం సంబంధిత శాఖలకు ఆదేశాలు జారీ చేశారు.*వచ్చే వేసవిలో ఆధునీకరణ*వచ్చే వేసవికల్లా వరద కాలువలను సంపూర్ణంగా ఆధునికరిస్తామని ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు పేర్కొన్నారు.ప్రధాన, ఉపకాలువలు, కెనాల్స్ అన్నింటినీ శాస్త్రీయంగా అభివృద్ధి చేస్తాం. ఇకపై వరదలతో రైతు నష్టపోకుండా శాశ్వత పరిష్కార చర్యలు తీసుకుంటాం” అని హామీ ఇచ్చారు.*రైతులకు పూర్తి భరోసా…*వరద కారణంగా పంట నష్టాలను అంచనా వేయించి, తగిన పంటనష్ట పరిహారం అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఎమ్మెల్యే ఏలూరి తెలిపారు. రైతు కష్టం వృథా కాకుండా అన్ని విధాలుగా ఆదుకుంటాం. ప్రభుత్వం రైతాంగానికి అండగా నిలుస్తోందని భరోసా ఇచ్చారు.*తుండి వాగు పరిశీలన….*ఓడరేవు పిడుగురాళ్ల హైవేలో తిమ్మరాజుపాలెం సమీపంలో తుండి వాగును ఎమ్మెల్యే ఏలూరి పరిశీలించారు. కాలువ ఆధునికరణ, మరమ్మతులు లేక కాలువ పూడికతో నిండిపోవడం వరద నీరు ముందుకు సాగే పరిస్థితి లేకపోవడం వల్ల వరద నీరంతా పొలాల్లోకి చేరిందని స్థానిక రైతులు ఎమ్మెల్యే ఏలూరికి వివరించారు. తక్షణమే వాగు ఆక్రమణలను తొలగించి ఆధునికరించాలని కోరారు.*డ్రోన్‌తో కలుపుమందు స్ప్రే పర్యవేక్షణ*కారంచేడు మండలం స్వర్ణ _రంగప్ప నాయుడు వారి పాలెం పొలాల సరిహద్దులో యువరైతు నాగరాజు డ్రోన్ల ద్వారా కలుపు మందు స్ప్రే విధానాన్ని ఎమ్మెల్యే ఏలూరి పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతులు ఆధునిక సాంకేతిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎప్పటికప్పుడు అందిపుచ్చుకోవాలన్నారు. సాంకేతికతను వినియోగించడంలో ప్రభుత్వం రైతులకు మరింత సహాయపడుతుందన్నారు.సమర్థవంతమైన సాగు పద్ధతులకు పూర్తి మద్దతు ఉంటుందన్నారు. ఆధునిక సాగుతో తక్కువ ఖర్చుతో అధిక లాభాలు సాధించవచ్చని పేర్కొన్నారు.





