Monday, March 16, 2026

చిత్తూరు కలెక్టర్ గారూ..ఇదేం తీరూ..- స్వేచ్ఛను హరించే హక్కు మీకెక్కడిది?- కలం కార్మికులపై ప్రతాపమేలా?- ఏపీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షులు డాక్టర్ ఎం.ప్రసాద్- స్మగ్లర్లకు కొమ్ముకాస్తూ.. ప్రశ్నించే వారిపై దౌర్జన్యమా- మెజిస్ట్రేట్ స్థాయిలో ఏంటీ ప్రవర్తన- వార్తలు రాస్తే లేపేస్తారా..- వెటరన్ జర్నలిస్ట్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ టి.జనార్ధన్- రాజ్యాంగపు హక్కులను కాలరాస్తారా?- బెదిరింపు దోరణి సరైందేనా?- తిరుపతి ప్రెస్ క్లబ్ అధ్యక్షులు మురళి- పత్రికా స్వేచ్ఛను హరిస్తున్న చిత్తూరు కలెక్టర్ కి వ్యతిరేకంగా ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో ధర్నా- నేటి సాక్షి తిరుపతి – (బాదూరు బాల)*తిరుపతి:*చిత్తూరు కలెక్టర్‌ వ్యవహారశైలిపై జిల్లాలోని జర్నలిస్టులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విలేకరులపై దురుసుగా మాట్లాడటం, బెదిరింపులకు పాల్పడటంపై నిరసన వ్యక్తం చేస్తూ శనివారం తిరుపతిలో ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (ఏపీయూడబ్ల్యూజే) ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. తిరుపతిలోని గాంధీ విగ్రహం ఎదుట జరిగిన ఈ నిరసన కార్యక్రమంలో జర్నలిస్ట్ సంఘాల నేతలు, సభ్యులు పెద్దఎత్తున పాల్గొన్నారు. కలెక్టర్‌ వైఖరికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ.. తక్షణమే ఆయనపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.కలం కార్మికులపై ప్రతాపమేలా?- ఏపీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షులు డాక్టర్ ఎం ప్రసాద్ఏపీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షులు డాక్టర్ ఎం ప్రసాద్ మాట్లాడుతూ.. గతంలో విలేకరులను రాజకీయ నాయకులు, రౌడీలు, స్మగ్లర్లు, గూండాలు బెదిరించేవారని, కానీ ఇప్పుడు ఏకంగా ఐఏఎస్‌ అధికారులు, జిల్లా మెజిస్ట్రేట్లే ఆ స్థాయికి దిగజారడం విచారకరమన్నారు. ఇద్దరు విలేకరులకు కలెక్టర్ ఫోన్ చేసి, ఒక ఉద్యోగి ఫిర్యాదు చేశారని సాకుగా చూపి మిమ్మల్ని లేపేస్తాను అని బెదిరించడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. కలెక్టర్ అన్న విషయాన్ని మర్చిపోయి, మెజిస్ట్రేట్ స్థాయిలో ఏంటీ ప్రవర్తన అని మండిపడ్డారు. విలేకరులను బెదిరించడమే కాకుండా, వారి పిల్లలు ఎక్కడున్నారో ట్రాక్ చేస్తాను, వారి అంతు చూస్తాను అని కలెక్టర్ బెదిరించడం దారుణమన్నారు. ఎస్ఐకి, డీఈవోలకు ఆదేశాలివ్వండి, ఇంటెలిజెన్స్ ద్వారా కనుక్కోండి అంటూ కలెక్టర్ ఆదేశాలు ఇవ్వడంపై ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. విలేకరుల పిల్లలు ఎక్కడ చదువుతున్నారో మీరు ఎంక్వైరీ చేయాల్సిన అవసరం లేదు. మేమే చెప్తాం. మీకు దమ్ముంటే ఏదైనా చేయండి. ఆ విలేకరి పిల్లలకు ఏదైనా జరిగితే కలెక్టర్‌గా మీరే జవాబుదారి అని డాక్టర్ ఎం ప్రసాద్ హెచ్చరించారు.స్మగ్లర్లకు కొమ్ముకాస్తూ.. ప్రశ్నించే వారిపై దౌర్జన్యమా?- వెటరన్ జర్నలిస్ట్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ టి.జనార్ధన్వెటరన్ జర్నలిస్ట్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ టి.జనార్ధన్ మాట్లాడుతూ.. కలెక్టర్ వ్యవహారశైలి రాజ్యాంగ విరుద్ధమని అన్నారు. రాజ్యాంగపు హక్కులను కాలరాస్తారా? అని ఆయన ప్రశ్నించారు. రాజకీయ నాయకులకు, స్మగ్లర్లకు, క్వారీ యజమానులకు అండగా ఉంటూ విలేకరులను బెదిరించడం సరికాదని ఆయన ధ్వజమెత్తారు.బెదిరింపు దోరణి సరైందేనా?- తిరుపతి ప్రెస్ క్లబ్ అధ్యక్షులు మురళితిరుపతి ప్రెస్ క్లబ్ అధ్యక్షులు మురళి మాట్లాడుతూ, కలెక్టర్ బెదిరింపు ధోరణిని ఖండించారు. బెదిరింపు దోరణి సరైందేనా? అని ప్రశ్నించారు. విలేకరుల తప్పు ఉంటే చట్టపరంగానో, న్యాయబద్ధంగానో చర్యలు తీసుకోవాలే తప్ప వ్యక్తిగతంగా మాట్లాడడం బాధాకరమన్నారు.తక్షణ చర్యలు తీసుకోకపోతే రాష్ట్రవ్యాప్త ఆందోళనజర్నలిస్ట్ సంఘాల నేతలు మాట్లాడుతూ.. కలెక్టర్ చేసిన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలని, విలేకరులపై పెట్టిన కేసులను తక్షణం ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి కలెక్టర్‌పై చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో జర్నలిస్ట్ సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో తిరుపతి ప్రెస్ క్లబ్ కార్యదర్శి బాలు, ఐజెయు జాతీయ కౌన్సిల్ సభ్యులు రాజేంద్ర, ఏపీయూడబ్ల్యూజే జిల్లా కోశాధికారి చంద్రబాబు, సహాయ కార్యదర్శులు శీను బాబు, కోటేశ్వరరావు, జిల్లా కార్యవర్గ సభ్యులు రాధాకృష్ణ, బాలయ్య, విశాలాంధ్ర తిరుపతి ఎడిషన్ మేనేజర్ సుబ్బరాయుడు, చిత్తూరు జిల్లా కోశాధికారి వాలీశ్వర్ రెడ్డి, కార్యవర్గ సభ్యులు ఎల్ ఎస్ ఖాన్, ఉదయ్, సీనియర్ జర్నలిస్టులు రాఘవ, శ్రీకాంత్, జర్నలిస్టులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. తిరుపతి చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు మోహన్ కుమార్ రాజు ధర్నాలో పాల్గొని సంఘీభావం తెలియజేశారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News