నేటి సాక్షి .ఆసిఫాబాద్ఈరోజు రైతు హక్కుల పోరాట సమితి ముఖ్య నాయకుల సమావేశం ఆసిఫాబాద్ పట్టణంలోని అఖిల భారత మాలి సంక్షేమ సంఘం భవనంలో సమావేశం నిర్వహించడం జరిగింది ఇట్టి సమావేశంలో ప్రత్తి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలైన 1.కపాస్ కిసాన్ యాప్ రద్దుపై,2.ప్రతి కొనుగోలులో రైతుల వద్ద ఉన్న ప్రతి పూర్తిగా కొనుగోలు చేయాలని ఎటువంటి నిబంధనలు పెట్టకూడదని 3. దళారీ వ్యవస్థను రద్దు చేయాలని 4.తేమశాతం 12% నుండి 20% సడలింపు ఇవ్వాలని పలువురు రైతులు మాట్లాడడం జరిగింది ఇట్టి సమస్యల సాధనకై జిల్లాస్థాయి రైతు జేఏసీ ఏర్పాటు చేయుటకై తేదీ 10.11.2025 సోమవారం రోజున మధ్యాహ్నం 12 గంటలకు జిల్లాస్థాయి ముఖ్య రైతుల సమావేశం ఏర్పాటు చేయడం ఇట్టి సమావేశంలో జిల్లా జేఏసీ కమిటీని ఎన్నుకోవడం జరుగుతుంది.అనంతరం భవిష్యత్తు ఉద్యమ కార్యాచరణ ప్రకటించడం జరుగును కావున జిల్లాలోని ముఖ్య రైతులు హాజరు కావలసిందిగా మనవి.ఇట్టి కార్యక్రమంలో రేగుంట కేశవరావు మాదిగ ,రూప్న రమేష్ ,నాగోష శంకర్, బొట్టుపల్లి జయరాం, ఇందూరి తిరుపతి, పష్టం అంజన్న, వైరాగడ మారుతి పటేల్ ఇందూరి ిరుపతి ,గురునులే మెంగాజీ ,మోర్లే తిరుపతి ,కావుడే దత్తు మరియు వివిధ నాయకులు పాల్గొనడం జరిగింది





