*మహిళలు ఆర్థిక స్వావలంబన దిశగా అడుగులు వేయాలి**దేశ అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలి* *సమాజంలో జీవన జ్యోతిని వెలిగించాలి*- *స్త్రీ శక్తిని చాటాలి*…*చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ.., ఎమ్మెల్యే డాక్టర్ మురళి మోహన్* *మగువలు అన్ని రంగాల్లో ఎదిగేందుకు తోడ్పాటునందిస్తున్న ఏపీ సీఎం చంద్రబాబు చిత్ర పటానికి మహిళలు కలిసి పాలాభిషేకం చేసిన ఎంపీ, ఎమ్మెల్యేలు**తవణంపల్లి*మహిళలు ఆర్థిక స్వావలంబన దిశగా అడుగులు వేయాలని.., దేశ అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని, స్త్రీ శక్తిని చాటాలని చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమళ్ళ ప్రసాదరావు.., పూతలపట్టు ఎమ్మెల్యే డాక్టర్ మురళి మోహన్ ఆకాంక్షించారు.జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ -వెలుగు..,పూతలపట్టు ఎమ్మెల్యే మురళి మోహన్ నేతృత్వంలో.. పూతలపట్టు నియోజకవర్గం,తవణంపల్లిలో నిర్వహించిన తెలుగు మహిళా మార్ట్ లాభాలు — బ్యాంకు రుణాల పంపిణీ కార్యక్రమానికి చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమళ్ళ ప్రసాదరావు ముఖ్య అతిథిగా హాజరైయ్యారు. అంతకు ముందు కార్యక్రమానికి విచ్చేసిన చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావుకు పూతలపట్టు నియోజకవర్గానికి చెందిన మండలాధ్యక్షులు, కూటమి నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు సాదర స్వాగతం పలికారు. ముందుగా మహిళల ఆర్థికాభివృద్ధికి తోడ్పాటునందించిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిత్ర పటానికి మహిళా మణులతో కలిసి పాలాభిషేకం చేశారు ఎంపీ ఎమ్మెల్యేలు.అనంతరం జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ- వెలుగు.., శ్రీ శక్తి పథకం కింద మంజూరైన రుణాలకు సంబంధించిన చెక్కులను లబ్ది దారులకు అందించారు చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు, ఎమ్మెల్యే డాక్టర్ మురళి మోహన్…ఈసందర్భంగా వారు మాట్లాడుతూ…ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు డ్వాక్రా మహిళలకు గ్రామీణాభివృద్ధి సంస్థ -వెలుగు.., ద్వారా అందిస్తున్న సేవలు స్ఫూర్తిదాయకమని కొనియాడారు. మహిళలు అన్ని రంగాల్లో ఎదిగేందుకు సీఎం చంద్రబాబు చేస్తున్న కృషి ఎనలేనిదన్నారు. స్త్రీలు సమాజంలో జీవన జ్యోతిని వెలిగించి, స్త్రీ శక్తిని చాటాలని వారు పిలుపునిచ్చారు..ఈ కార్యక్రమంలో జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ -వెలుగు అధికారిణి శ్రీదేవి, కూటమి నాయకులు, కార్యకర్తలు, డ్వాక్రా మహిళలు పాల్గొన్నారు.

