Tuesday, March 17, 2026

*చంద్రన్న పాలనలో…పేదల సొంతింటి కల సాకారం…*•ఎన్టీఆర్ ఆశయాన్ని కూటమి ప్రభుత్వం నెరవేర్చుతోంది •పేదల గృహ కలకు నేడు నూతన ఊపిరి•సెంటు పట్టా పేరుతో జగన్ భారీ దోపిడీ•16 నెలల్లో 3 లక్షల ఇళ్లు చారిత్రాత్మక ఘట్టం•2029 నాటికి ప్రతి అర్హుడికి పక్కా ఇల్లు•ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు నేటి సాక్షి, బాపట్ల జిల్లా (పర్చూరు)పేదల సొంతింటి కల సాకారమవుతున్న ఈరోజు చారిత్రాత్మకమని,ఎన్టీఆర్ ‘ప్రతి పేదవాడికి సొంతిల్లు’ అనే ఆశయాన్ని కూటమి ప్రభుత్వం నెరవేర్చుతోందని ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు అన్నారు.ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దూరదృష్టితో కేవలం 16 నెలల్లోనే 3 లక్షల ఇళ్లు పూర్తి చేసి తాళాలు పేదలకు అందజేయడం చరిత్రలో నిలిచిపోతుందన్నారు. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా ప్రభుత్వం సంకల్పబలం కోల్పోలేదని, ఇళ్ల నిర్మాణంలో ఎక్కడా జాప్యం జరగకుండా యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయడం పేదల పట్ల ప్రభుత్వ అంకితభావానికి నిదర్శనమని పేర్కొన్నారు. 2014-19 మధ్య కాలంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం12 లక్షల గృహాలను పూర్తి చేసి పేదలకు అందించిందని, అదే పద్ధతిలో ఇప్పుడు కూడా ప్రభుత్వం వేగంగా ఇళ్లు నిర్మిస్తోందన్నారు.జగన్ రెడ్డి పాలనలో పేదల కలలు ధ్వంసమయ్యాయని ఆయన విమర్శించారు. పేదలందరికీ ఇళ్లు ఇస్తానని చెప్పి, సెంటు పట్టా పేరుతో జగన్ రెడ్డి ముఠా రూ.7,500 కోట్ల దోపిడీకి పాల్పడిందని ఆరోపించారు.పేదవాడి ఇంటికి సెంటు ఇచ్చి తాను మాత్రం కోట్ల విలువైన ప్యాలెస్‌ల్లో సేదతీరాడని, ఇసుక, భూమి, చదును పేర్లతో భారీ అవినీతికి పాల్పడ్డాడుని ఏలూరి విమర్శించారు. గత ప్రభుత్వం పేదల కలలకు తాళం వేసిందని, నేటి కూటమి ప్రభుత్వం గృహ నిర్మాణాన్ని వేగం చేసి తాళం తెరిచి గౌరవంగా సొంతిల్లు ఇస్తోందని ఆయన పేర్కొన్నారు.*సమగ్ర గృహ నిర్మాణం – సమగ్ర అభివృద్ధి:*గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు కేటాయిస్తూ ప్రభుత్వం ప్రతి పేద కుటుంబానికి స్థలం కల్పిస్తోందని, సొంత స్థలం ఉన్నా ఇల్లు నిర్మించుకోలేని వారికి కూడా రూ.4 లక్షల ఆర్థిక సాయం అందిస్తున్నామని ఆయన వివరించారు. రాష్ట్ర వాటా 40%( రూ.1.50 లక్షలు), కేంద్ర వాటా 60%( రూ.2.50 లక్షలు)గా ఉండడం వల్ల ఈ పథకం మరింత బలపడిందని అన్నారు. 2029 నాటికి రాష్ట్రంలోని ప్రతి అర్హుడికి పక్కా ఇల్లు ఇవ్వడం చంద్రబాబు నాయుడు ప్రభుత్వ లక్ష్యం అన్నారు.ఈ రోజు పేదల ఇళ్ల కలలు నిజమవుతున్నాయని, ఇళ్లు మాత్రమే కాదు,గౌరవం కూడా ఇస్తున్నామని ఎమ్మెల్యే ఏలూరి అన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News