***పత్రిక ప్రకటన***అక్రమ ఇసుక రవాణా చేస్తున్న ట్రాక్టర్ల పట్టివేతకరీంనగర్ రూరల్, తేదీ: 13.11.2025 రోజున పోలీసులు గ్రామాల్లో పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా తీగలు గుట్టపల్లిలోని రైల్వే గేటు వద్ద మరియు బొమ్మకల్లోని ఫ్లైఓవర్ బ్రిడ్జి వద్ద అక్రమ ఇసుక రవాణా చేస్తున్న ట్రాక్టర్లను కరీంనగర్ రూరల్ పోలీసులు పట్టుకున్నారు, వివరాల్లోకి వెళితే గొల్లపల్లి గ్రామం సుల్తానాబాద్ మండలానికి చెందిన బొంకురి నరేష్ మరియు పున్న గంగరాజు అనువారు తమ ట్రాక్టర్ మరియు ట్రైలర్ల నందు ఇసుకను అక్రమంగా కరీంనగర్ వైపు తరలిస్తున్న క్రమంలో పోలీసులు తీగలగుట్టపల్లి లోని రైల్వే గేటు వద్ద పట్టుకున్నారు మరియు బొమ్మకల్ గ్రామానికి చెందిన ఏడేల్లి రాజు అనునతడు తన ట్రాక్టర్ మరియు ట్రైలర్ నందు ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుకను తరలిస్తుండగా బొమ్మకల్ లోని ఫ్లై ఓవర్ బ్రిడ్జి వద్ద కరీంనగర్ రూరల్ పోలీసులు పట్టుకున్నారు, పై ముగ్గురి మీద కేసు నమోదు చేసి ట్రాక్టర్లను సీజ్ చేసి తదుపరి చర్య నిమిత్తం కోర్టుకు పంపనైనది మరియు మరొక సారి అక్రమ రవాణా చేయకుండా కరీంనగర్ రూరల్ ఏంఆరో గారి ముందు హాజరు పరచి మూడు లక్షల పూచికత్తుతో బైండోవర్ చేయడమైనది అని కరీంనగర్ రూరల్ సీఐ ఏ. నిరంజన్ రెడ్డి గారు తెలిపారు.ఇట్లు ఏ.నిరంజన్ రెడ్డిఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ కరీంనగర్ రూరల్ పీస్





