Wednesday, March 18, 2026

*కుల దురహంకారానికి రాజశేఖర్ బలి – హంతకులను వెంటనే ఉరిశిక్ష విధించాలి : కేవీపీఎస్ గర్జన*మహబూబాబాద్ / నర్సింహులపేట – భూక్యా రవి నాయక్ రిపోర్ట్తేదీ : నవంబర్ 17రంగారెడ్డి జిల్లా ఫరూక్‌నగర్ మండలం ఎల్లంపల్లి గ్రామంలో జరిగిన దళిత యువకుడు ఎర్ర రాజశేఖర్ సజీవదహనం ఘటన రాష్ట్రాన్ని షాక్‌కు గురి చేసింది. ప్రేమవివాహం చేసుకున్న తన అన్నను అంగీకరించలేదన్న కుల దురహంకారంతో, వధువు కుటుంబం రాజశేఖర్‌ను కిడ్నాప్ చేసి, కొట్టి, చివరకు పెట్రోల్ పోసి కాల్చేసిన అమానుషానికి కేవీపీఎస్ మండల నాయకులు చెలరేగిపోయారు.“ఇది హత్య కాదు… కులదురహంకారం పీక్‌కి చేరిన అత్యంత క్రూర దాడి!ఇలాంటి కుల మృగాలు చట్టం ఎవరమో అర్థం చేసుకునేలా ఉరి శిక్ష విధించాలి!” అని కేవీపీఎస్ జిల్లా నాయకుడు గునిగంటి మోహన్ గర్జించారు.*“మోయినాబాద్ పోలీసుల నిర్లక్ష్యం, పక్షపాతం… అదే ఈ దారుణానికి అసలు కారకం!” – కేవీపీఎస్ విమర్శ**కేవీపీఎస్ నాయకుల ప్రకారం:*ప్రేమవివాహం జరిగిన రోజు నుంచే వధువు కుటుంబం బెదిరింపులు మొయినాబాద్ పోలీస్ స్టేషన్‌లోనే చంద్రశేఖర్ తండ్రి, అన్నపై దాడిపోలీస్‌లు చూస్తూ ఉన్నా ఒక్కరిని పట్టలేదుపక్షపాతం, పైవారి ప్రభావం… అదే హంతకులకు రెక్కలుఆ ధైర్యంతోనే రాజశేఖర్‌ను “మాట్లాడుకుందాం” అని పిలిచి కిడ్నాప్వెంటనే దారుణ హత్య… ఆ తరువాత సజీవదహనం“పోలీస్ స్టేషన్‌లో దాడి జరిగితే కూడా చట్టం పని చేయకపోతే… పల్లెల్లో దళితుల ప్రాణాలు ఎలా రక్షణ పొందుతాయి?ఈ నిర్లక్ష్యంలో ఉన్న పోలీసులూ… ఈ హత్యలో నేరస్తులే!” అని నాయకులు మండిపడ్డారు.*కులహింస వరుసగా పెరుగుతోంది — ప్రభుత్వం ఎందుకు మూగబోయింది?**కేవీపీఎస్ నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ అన్నారు:**కొమరం భీం – ఆసిఫాబాద్‌లో కోడలిని మామ హతమార్చిన కేసు**షాద్‌నగర్‌లో అన్న హత్య**ఇప్పుడు ఎల్లంపల్లి సజీవదహనం*“ప్రభుత్వం, అధికారులు, ప్రజాప్రతినిధులు… ఎవ్వరూ స్పందించకపోవడంతో కుల హింస దోపిడీలా పెరుగుతోంది.దళితుల ప్రాణం విలువ లేదన్న భావనే ఈ నేరస్థుల్లో పెరుగుతోంది” అన్నారు.*కేవీపీఎస్ 10 డిమాండ్లు – ఒక్కటైనా విస్మరించే అవకాశం లేదు!*1. వధువు తండ్రి కావలి వెంకటేష్ సహా హత్యలో పాల్గొన్న అందరి నిందితులను వెంటనే అరెస్టు చేయాలి.2. కిడ్నాప్, హత్య, సజీవదహనం… అన్ని కలిపి ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ పూర్తి సెక్షన్లతో కేసు నమోదు చేయాలి.3. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి కేసు విచారణ వేగంగా పూర్తిచేయాలి.4. ప్రభుత్వ ఉన్నతాధికారులు వెంటనే బాధిత కుటుంబాన్ని కలవాలి.5. రాజశేఖర్ భార్యకు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి.6. కుటుంబానికి కనీసం ₹50 లక్షల ఎక్స్‌గ్రేషియా మంజూరు చేయాలి.7. రంగారెడ్డి జిల్లా కలెక్టర్, ఎస్పీ స్వయంగా బాధితులకు హామీ ఇవ్వాలి.8. ప్రేమవివాహం చేసుకున్న మెజర్ యువత రక్షణ కోసం ప్రభుత్వం ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేయాలి.9. మొయినాబాద్ పోలీసుల నిర్లక్ష్యంపై తక్షణ కఠిన చర్యలు – సస్పెన్షన్ సహా.10. రాష్ట్రంలో కులాంతర వివాహితల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి.“రాజశేఖర్ ఆత్మకు న్యాయం జరిగే వరకు కేవీపీఎస్ పోరాటం ఆగదు… అవసరమైతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు!” – కేవీపీఎస్ గర్జన నిరసనలో పాల్గొన్న నాయకులు స్పష్టంగా హెచ్చరించారు:“ప్రతి దళిత బిడ్డ గుండెల్లో మండుతున్న ఆగ్రహం ప్రభుత్వం వినాలి.ఇంకో రాజశేఖర్, ఇంకో దళిత బలి… రాష్ట్రం చూడదు!నిందితులు, వారిని కాపాడిన అధికారులూ — ఎవ్వరినీ విడిచిపెట్టం!” ఈ ఘోరమైన హత్యకు సమాజానికి కుదిపేసింది మరో కుల దురహంకార హత్య కూడా జరగకుండా రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకునే విధంగా చేయాలని ఎస్సీ ఎస్టీ బిడ్డలు కోరుకుంటున్నారు

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News